(ఈరోజు-రాజమహేంద్రవరం)
తూర్పుగోదావరి జిల్లాలో చేపల రైతులు ఆర్ధికంగా అభివృద్ధి చెందడటంతోపాటు..రాష్ట్ర, జాతీయ స్థాయిలో ముందుండాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలయకులు ఎన్.నిర్మల కుమారి పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం మత్స్యశాఖ కార్యాలయంలో జాతీయ చేపల రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిషరీష్ జేడీ నిర్మల కుమారి మాట్లాడుతూ.. మత్స్యరంగ ఆర్ధిక అభివృద్ధి లో అక్వా రైతుల కృషి అమూల్యమైనదన్నారు. సుస్థిరమైన అక్వా సాగు పద్దతుల పట్ల వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయమైనదని కొనియాడారు. అనంతరం జాతీయ చేపల రైతుల దినోత్సవ ప్రాముఖ్యతను ఆమె ఎంతో చక్కగా వివరించారు. 1957 జులై 10 న ఒదిశ రాష్ట్రం లోని కటక్ లో ఉన్న సెంట్రల్ ఇనలాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) లో డాక్టర్. హీరాలాల్ చౌదరి, డాక్టర్. అలీ కూన్హి ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి మెజర్ కార్స్ విజయవంతమైన ప్రేరేపిత పెంపక ప్రయోగాన్ని చేపట్టారన్నారు.
ఈ కృషని గుర్తుంచి వారిని ప్రతీ ఏడాదీ గౌరవించే ఉద్దేశంతోనే జూలై 10న జాతీయ చేపల రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన చేపల రైతులకు అధిక స్థాయిలో చేప విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రపంచంలో మంచి నీటి చేపల ఉత్పత్తి లో భారత దేశం రెండవ స్థానం లో ఉన్నదన్నారు. అదేవిధంగా భారత దేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో ఉన్నదని చేపల రైతులకు అవగాహనక కల్పించారు. జిల్లాలోనూ.. రాష్ట్రంలోనూ చాలా చోట్ల చేపలపెంపకం ఒక ప్రధాన ఉపాధి వనరని చెప్పి ఆమె దీని వలన ఆర్ధికంగా మత్స్యకారులు అభివృద్ధి చెందడానికి మత్స్య పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎంతో వీలుంటుందన్నారు. చేపలను నిత్యం ఆహారంగా తీసుకోవడం వలన పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార వనరులు తగ్గిపోతున్న తరుణంలో అన్ని రకాల నీటి వనరులను చేపల విత్తనాలను వేసుకుని సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు.
తద్వారా ఆహార భద్రతను కల్పించవచ్చని అన్నారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్సకారులు, చేపల రైతులకు అందిస్తున్న పథకాల కోసం కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు పులకుర్తి శ్రీనివాసు, జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ , మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్, అనపర్తి కొల్లాం రత్నం మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్, శ్రీకృష్ణ పట్నంలను బొకెలను అందజేసి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎం. బ్రహ్మానందం, ఫిషరీస్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, రాష్ట్ర మత్స్య సహకార సంఘం జేఏసీ నేత ఏ. సత్తిబాబు, జిల్లాలో గల మత్స్య సహకార సంఘ సభ్యులు, మత్స్యశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




