(ఈరోజు-విశాఖపట్నం)
జీవీఎంసీ వార్డుల విభజనపై మరోసారి చేపట్టిన అభ్యంతరాలు, సలహాల స్వీకరణ ప్రక్రియపై ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల మనసులో ఏముందో చాలా క్లియర్ గా అర్ధమైంది. దానితో దీని అవసరంపై స్పష్టత కూడా ప్రాధమిక స్థాయిలోనే తెలిసొచ్చింది. ప్రస్తుతం జీవిఎంసీలోని 98 వార్డులను 120కి పెంచే క్రమంలో గతంలోనే వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా రూపొందించి అభ్యంతరాలు స్వీకరించారు అధికారు. అయితే కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియను పక్కన పెట్టారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించిన తరువాత మళ్లీ అభ్యంతరాలు, సలహాల స్వీకరణ చేపట్టి ఈ నెల 11వ తేదీతో ముగించారు. ఈసారి జీవిఎంసీ ముందుకి 1500కు పైగా అభ్యంతరాలు, సలహాలు అందినట్లు చెబుతున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వాటిని అధికారులు నిజంగా పరిగణలోకి తీసుకుంటారా? వాటి ఆధారంగా వార్డుల సరిహద్దులు, విభజనలో మార్పులు చేస్తారా? లేక కేవలం అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు చూపించేందుకే తీసుకున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వార్డుల్లో ఉన్న ప్రజలకు కూడా మహావిశాఖనగరపాలక సంస్థ పరిధిలో మిగిలిన వార్డులను విలీనం ఇష్టం లేదనే విషయం ఇక్కడ చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రస్తుతం వున్న వార్డులకు కొత్తవార్డులు తోడైతే రాష్ట్రంలోనే జీవిఎంసీ అతిపెద్ద కార్పోరేషన్ గా అవతరిస్తుంది. అది రాజకీయంగా ప్రభుత్వానికి మేలు చేస్తున్నా..దాని వలన వచ్చే నష్టాలు చాలా ఉన్నాయని ఇక్కడ మేధావులు ఈ ప్రక్రియపై అయిష్టను ప్రజాభిప్రాయ సేకరణలో కుండ బద్దలు కొట్టారు.
మరోవైపు గతంలో రూపొందించిన ముసాయిదాలో ఎలాంటి మార్పులు ఉండవని, అదే తుది రూపం దాల్చుతుందన్న అభిప్రాయాలు అధికార వర్గాల చెబెతున్నాయి. అదే నిజమైతే ప్రజల నుంచి మళ్లీ అభ్యంతరాలు, సలహాలు ఎందుకు స్వీకరించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదంతా కేవలం కాగితాలకే పరిమితం చేసి మమా అనిపించేసి ప్రభుత్వానికి ఏది అనుకూలంగా వుంటుందో దానినే చేసుకు పోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. 1500కు పైగా వచ్చిన అభ్యంతరాలను ఏ విధంగా పరిశీలిస్తారు? ఎన్ని అభ్యంతరాలను ఆమోదిస్తారు? ఏమైనా మార్పులు చేస్తారా? లేక గత ముసాయిదానే ఖరారు చేస్తారా? అనే అంశాలపై జీవీఎంసీ అధికార యంత్రాంగం స్పష్టమైన వివరణ ఇచ్చే పరిస్థితిలో లేదని తెలుస్తుంది. కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని సాకు చూపించి మమా అనిపించేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు
కారణం ఏంటంటే ప్రస్తుతం విశాఖ వేధికగా జీవిఎంపీ పీఠం సాక్షిగా బల ప్రదర్శనకు దిగాలన్నది ప్రభుత్వం ఎత్తుగా కనిపిస్తున్నది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలు.. వార్డుల విలీనం సరిగ్గా కలిసొచ్చాయనేది ఇక్కడ చాలా స్పష్టం కనిపిస్తున్నది. చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినపుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే దానిని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. కానీ ఇక్కడ జీవిఎంసీ పీఠం కైవసం చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో వార్డుల విభజన..ప్రజాభిప్రాయ సేకరణలో ఎదరైన ప్రజల వ్యతిరేకత చర్చనీయాంశం అవుతుంది. చట్టపరంగా ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ చేయకుండా విభజన చేసేస్తున్నారనే మాట రాకుండా ఉండేందుకు కేవలం కాగితాలపై మాత్రం చూపించడానికి ఈ తూ తూ మంత్ర ప్రజాభిప్రాయ సేకరణ చేశారట. ఫైనల్ గా ప్రభుత్వం అనుకున్నట్టుగా వార్డుల విభజన అనుకున్నట్టుగా 120కి ఖారారుచేసి ఎన్నికలకు వెళ్లడానికి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించేశారని సమాచారం చూడాలి ప్రజల పెద్ద ఎత్తున వ్యతిరేక ఎదురైన వేళ జీవిఎంసీ అధికారులు, ప్రభుత్వం వార్డుల విభజన అంశాలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!




