(ఈరోజు-కర్నూలు(వెంకాయపల్లి), విశాఖపట్నం)
ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామంలోని ఉద్యోగుల మరణ మృదంగం కొనసాగుతుంది..ఒక్క జూన్ నెలలోనే ఐదుగురు ఉద్యోగులు మృతిచెందగా అందులో కర్నూలు జిల్లా మున్సిపల్ కార్పోరేషన్ లోని వీఆర్వోది అధికారులు పెట్టిన వేధింపులకు తాళలేక చేసుకున్న ఆత్మహత్య. దానికి మృతుడు రాసిపెట్టిన మరణ వాంగూళ్మమే కారణం. జిల్లాలోని వెంకయ్యపల్లికి చెందిన వీఆర్వో ఎండీ హుస్సేన్ వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నారు. దాని ఇబ్బందితో తాను బిఎల్వో విధులు చేయలేనని అధికారులకు మొరపెట్టుకున్నా..వారి మనసు కరగలేదు. కావాలని విధులు అప్పగించడం, టీసీలు, వీసీలతో దారుణంగా వేధించడంతో చేసేదేమి లేక కుటుంబం మొత్తానికి అన్యాయం చేసి బలంవంతంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న జిల్లాలోని వీఆర్వోలు హుస్సేన్ మృతదేహంతో శవయాత్ర నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే జిల్లా కలెక్టర్ వీఆర్వో కుటుంబానికి న్యాయంచేయాలని, వేధింపులకు గురిచేసిన తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం కాస్తా సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తన తండ్రికి వెన్నుపూస ఆపరేషన్ చేశారని.. ఫీల్డులో తిరగలేనని చెప్పినా అధికారులు తనను వేధించి బిఎల్వో విధులు బలవంతంగా వేయడంతోపాటు మానసికంగా వేధించారని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు కూడా హుస్సేన్ కి కుటుంబానికి సంఘీబావం తెలియజేస్తూ అధికారుల తీరుని ఎండగట్టారు... నొప్పి ఎక్కువైనా ఆ విషయం అధికారులకి చెప్పినా ఎక్కడా పట్టించుకోలేదని కూడా మృతుడు సూసైట్ నోట్ లో పేర్కొన్నారనే విషయాన్ని ఉద్యోగులు మీడియా ముందు ఏకవరు పెట్టారు. ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఆ ప్రాంతం అంతా అయ్యింది. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనలతో హోరెత్తించారు. దానితో భారీగా పోలీసులు మోహరించారు.
-సిసిఎల్ఏ రూల్స్ వేధింపుల అధికారులకు వర్తించవా..?
సచివాలయ ఉద్యోగులు తప్పుచేస్తే రాష్ట్ప్రభుత్వం ఆర్టికల్ 309, సీసీఎల్ఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకునే ప్రభుత్వం ఇపుడు వీఆర్వో ఆత్మకు అధికారులే కారణమని రాసిన సైసైడ్ నోట్ ఆధారంగా చర్యలు తీసుకుంటుందా..? భారత న్యాయ సంహిత సెక్షన్ 108 ప్రకారం..బాధితుడిని మానసికంగా లేదా శారీరకంగా ఎంతగానో వేధించి, ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని సృష్టిస్తేనే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ ఆధారంగా వేధింపులకు గురిచేసిన అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేయాలి భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టం ప్రకారం, ఎవరినైనా తీవ్రంగా వేధించడం వల్ల వారు ఆత్మహత్యకు పాల్పడితే , అది తీవ్రమైన నేరంగా పరిగనిస్తారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువైతే, నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. ఈ కారణం ఇపుడు నెల్లూరు జిల్లాలోని సచివాలయ ఉద్యోగిని వేధించిన తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ కి వర్తిస్తుంది. నిందితుడు కావాలనే దురుద్దేశంతో వేధించినట్లు బలమైన ఆధారాలు ఉంటే వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది..
వార్డు వీఆర్వో మృతదేహంతో జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగులు భారీ ఆందోళన.. బాధితుడు రాసిన సూసైట్ నోట్, కుటుంబ సభ్యుల వాంగూల్మం, రాష్ట్రప్రభుత్వం నేషనల్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ బుక్ కి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బలవంతంగా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్న బిఎల్వో విధులు, వాటి ఆధారంగానే ఉద్యోగులపై అధికారుల వేధింపులు.. దాని కోసం పెడుతున్న టీసీలు, వీసీలు, అన్నీ కూడా బిఎన్ఎస్108 కి బలమైన ఆధారాలు అవుతాయి.. శవయాత్ర అన్నీ పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.. ఈ ఆధారాలు కూడా హైకోర్టు లేదా.. సుప్రీం కోర్టుకి బలమైన ఆధారాలవుతాయి.. సచివాలయ ఉద్యోగిని దారుణంగా వేధించడం వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైట్ నోట్ రాసి.. అందులో అధికారుల పేర్లు రాసి మరీ ఆత్మ హత్య చేసుకోవడంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ఖచ్చితంగా సదరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చూడాలి వీఆర్వో ఎండీ హుస్సేన్ ఆత్మకు హత్యకు కారణమైన అధికారులపై పోలీసులు ఏం కేసులు పెడతారు..? రాష్ట్రప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది..?




