(ఈరోజు ప్రధానప్రతినిధి-విశాఖపట్నం)
వీఎంఆర్డీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ సీటుపై ఎవరి కన్నో పడింది...? దానికి అవినీతి, రాజకీయ రంగు పులిమితే.. ప్రభుత్వం ఇదెక్కడి తలనొప్పి అంటూ కమిషనర్ ను మార్చేస్తుంది..అనుకున్న ఒక వర్గం ఏకంగా కమిషనర్ తేజ్ భరత్ భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ తెగ హడావిడీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు టెక్నాలజీ ఆలోచనలను అందిపుచ్చుకొని వీఎంఆర్డీఏ రాష్ట్రాభివృద్ధిలో విశాఖకే తలమానికంగా నిలపాలని చూస్తున్న కమిషనర్ తేజ్ భరత్ పై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఏవేవో సాకులు చూపిస్తూ తెగ హడావిడీ చేస్తున్నారు. పరిపాలనా పరమైన విషయాల్లో విశేష అనుభవం ఉన్న ఈయన ముందు ఆ.. ఆటలు సాగడం లేదు. కాకపోతే బురద చల్లితే మరక ఉండిపోతుంది.. ఆ మరకను మరక వేసిన వారితోనే చెరపాలంటే దానికి న్యాయపోరాటం ఒక్కటే అస్త్రం.
బిఎన్ఎస్ అస్త్రాలతోనే విఎంఆర్డీఏ కమిషనర్ ధీటుగా పోరాటం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు.. అందునా వీఎంఆర్డీఏ లాంటి సంస్థలో చేస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వుంటుంది. అయితే అక్కడ అంతకంటే భారీ అవినీతి జరిగిపోతుందని.. ఎవరెవరికో లబ్ది చేకూర్చడానికి భారీస్థాయిలో అవినీతి పాల్పడుతున్నారంటూ మీడియా ముఖంగా చేస్తున్న ఆధారాలు లేని ఆరోపణలు..తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వాస్తవానికి వీఎంఆర్డీఏ ఏదైనా ఒక ప్రాజెక్టు చేపడితే అది ప్రజల సౌకర్యార్ధం.. పర్యాటకాభివృద్ధి కాంక్షిస్తూ.. ప్రభుత్వానికి గౌరవం తెచ్చేవిధంగా మాత్రమే చేస్తుంది. ఎందుకంటే విఎంఆర్డీఏ ప్రాజెక్టుల స్థాయి అలాంటిది. దానికోసం టెక్నాలజీని వినియోగించాల్సి వుంటుంది. ఆ సమయంలో ప్రత్యేకంగా వెబ్ సైట్లు, యాప్ లు కూడా రూపొందించాలి. అవేమీ చిన్నా చితకా పనులు కాదు కదా.. లక్షలు.. కోట్లతో వ్యవహారం. అయినా ఆ వినియోగం అంతా ప్రజలకోసమే.. పర్యాటాభివృద్ధి కోసమే. దానికిపోయి అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం అంటే.. టెక్నాలజీ వ్యవహారాలు రూపాయి అర్ధరూపాయితో జరిగేవి కాదు.. ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి..
అలా అనుమతులు వస్తేనే కదా..వీఎండీఏ కమిషనర్ అయినా పనులు చేపట్టేది. దానినే అవినీతి, ప్రజల డబ్బు కమిషనర్ ఏఏ సంస్థలకో అప్పగించేస్తున్నారంటే అర్ధమేముంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, టెక్నాలజీ దాని ఖర్చులు వేరు.. చేస్తున్న ఆధారాలు లేని ఆరోపణలు వేరు..దానిపై మీడియాలో వస్తున్న కథనాలు వేరు. కాకపోతే ఇక్కడ ఇంటి దొంగలపైనా కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వీఎంఆర్డీఏ చేపట్టే ప్రాజెక్టులు.. టెక్నాలజీ వినియోగం.. దానికవుతున్న ఖర్చుల వివరాలు ఎవరు లీక్ చేస్తున్నారనేది కూడా చర్చనీయాంశ అవుతుంది. అయితే వీఎంఆర్డీఏ వస్తున్న అసత్యకథనాలు మంత్రి నారాయణ, సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆ వర్గం ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఫలించలేదని తెలుస్తుంది. పైగా తేజ్ భరత్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన యాప్ లను, వెబ్ సైట్లను నేరుగా పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభి కమిషనర్ తేజ్ భరత్ ను వెన్నుతట్టడం కూడా ఆ వర్గానికి మింగుడు పడటం లేదట..!
-ఐఏఎస్ లపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే.. బిఎన్ఎస్ లోని ఆ సెక్షన్లతో మామూలుగా ఉండదు
వాక్ స్వాతంత్ర్యం ఉందని ఎవరైనా ఇష్టాను సారం మాట్లాడినా..చేతిలో పెన్నందుని జర్నలిస్టులు, మీడియా.. ఎవరో ఏదో చెప్తే అలా రాసి ఐఏఎస్ అధికారులను బెదిరించాలని చూసినా.. మానసికంగా వేధించాలని చూసినా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించవచ్చు. అదేవిధంగా సెక్షన్ 353 ప్రకారం హద్దులు దాటి ప్రవర్తించినా..ఆధారాలు లేని ఆరోపణలు చేసినా తమ పరువుకి భంగం వాటిల్లిందని అధికారులు భావిస్తే పరువునష్టం కేసు వేయవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి, సంస్థ పరువుకి భంగం వాటిల్లినపుడు ఎవరైనా న్యాయపరంగానే ముందుకి వెళ్లే అవకాశం వుంటుంది. అందులోనూ జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులంటే జిల్లా మెజిస్ట్రేట్ హోదా ఉన్న అధికారులు. అలాంటివారిపై ఆధారాలు లేని బురద చల్లితే ఇక వ్యవహారం మామూలుగా ఉండదు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు ఆధారాలు లేని ఆరోపణలను పట్టించుకోరు. కానీ విశాఖలో వీఎంఆర్డీఏకి గానీ. ఇక్కడ పనిచేసే మెట్రోపాలిటన్ కమిషనర్ కి ఒక స్థాయి, హోదా ఉంటాయి. అలాంటి వారిపై అవినీతి, నిందారోపణలు చేస్తే.. వాటిని రుజువుచేయలేపోతే.. న్యాయస్థానంలో రక రకాలుగా వుంటుంది..
-వీఎంఆర్డీఏ కమిషనర్ సీటుపై ఎవరి కన్ను పడింది..?
వీఎంఆర్డీఏ కమిషనర్ సీటుపై ఎవరి కన్నుపడింది...? ఎందుకు ఇంత భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు చేయడానికి తెరవెను ఉండి ఎవరు ఎవరి ద్వారా హడావిడీ చేస్తున్నారు..? అనే విషయాలపై నిఘా సంస్థలు కూడా విచారణ ప్రారంభించినట్టు సమాచారం అందుతుంది. అందులోనూ కమిషనర్ తేజ్ భరత్ తనపై ఆరోపణలు చేసిన వారికి కోర్టు నోటీసులు పంపడం కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. అదే సమయంలో ఇంటి దొంగలు ద్వారా సమాచారం బయటకు వెళ్లి ఐఏఎస్(జిల్లా మెజిస్ట్రేట్) కలిగిన అధికారిపై బురదచల్లితే విసుగు చెంది సీటు వదిలి వెళ్లిపోతారు..? లేదంటే ప్రభుత్వమే ఈ తలనొప్పి ఎందుకని అధికారులను మార్పు చేస్తుందనే కుటిల వ్యూహంతోనే ఇదంతా చేస్తున్నారా..? అసలు తెరవెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతోందట. లేని పోని అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వ సంస్థ వీఎంఆర్డీఏకు, తన పురువుకి బంగం వాటిల్లుతోందని భావించి కోర్టు నోటీసులు పంపిన విషయంలో కమిషనర్ దైర్యంపైనా ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయట.
అయితే ఈ పోస్టులోకి రావడానికి ఓ ఇద్దరు ఐఏఎస్ లు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు భాగా ఉన్న సంస్థగా వీఎంఆర్డీఏకి గుర్తింపు వుంది. ఇక్కడికొస్తే హ్యాపీగా రెండు మూడేళ్లు పనిచేసుకోవచ్చుననే ఆలోచనలతోనే కొందరుని అడ్డం పెట్టుకొని రాజకీయంగా.. అవినీతి బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. అంతేకాదు ప్రభుత్వ అనుకూల మీడియా, మరికొన్నింటిని అడ్డుపెట్టుకొని పనిగట్టుకొని బురదచల్లడంపైనా నిఘా వర్గాలు వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అయినా ఎవరితోనైనా పెట్టుకోవచ్చుగానీ డేరింగ్ అండ్ డైనమిక్ తేజ్ భరత్ లాంటి ఐఏఎస్ లతో పెట్టుకుంటే వ్యవహారం నెక్ట్స్ రేంజ్ లో ఉంటుందనే విషయం కూడా ఆ వర్గానికి ఇప్పటికే అర్ధమైందట.. మరికొద్దరోజుల్లోనే ఈ సీటుపై ఎవరి కన్నుపడింది.. ఎందుకు ఈ హడావిడీ చేస్తున్నారనే విషయం తేలిపోనుంది..!




