(ఈరోజు-అల్లూరి పాడేరు, చింతపల్లి, అరకువేలి)
విభజన అల్లూరి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుంచాలని.. గిరిజనులకు ఆర్ధికంగా అండగా నిలవాలని.. అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ నిషాంతి చేస్తున్న ప్రతీ అడుగూ ఇపుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఒక ఐఏఎస్ అధికారిణి తలచుకుంటే మట్టికూడా బంగారం అవుతుందనడానికి ఇపుడు దేశస్థాయిలో వచ్చిన గౌరవమే దానికి తార్కాణం. విద్యార్ధులకు ఉత్తమమైన విద్యను అందించడానికి ఏఎస్ఆర్ ఆనందం అనే కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు ఒక చక్కటి చదువుల బాట వేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గిరిజన గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఏజెన్సీలో ఎప్పటి నుంచో నాటుకుపోయి బహిర్భూమి వ్యవస్థను వ్యక్తిగత మరుగుదొడ్లవైపు మళ్లే చేస్తున్నారు. అంతేకాదు పురాత పురుడు(ప్రసవం)వ్యస్థల్లో మార్పు తీసుకు వచ్చి గిరిజన మహిళలను కూడా పీహెచ్సీలకు రప్పించి ఆరోగ్యకరమైన ప్రసవాలు చేయించేందుకు గిరిపుత్రుల్లో ప్రత్యేక చైతన్యం తీసుకురావడానికి ఆమె చేస్తున్న కృషి..
చేస్తున్న సమీక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించడం, మిగిలిన ప్రాంతాల్లో మిగిలి పోయిన నిర్మాణాలను పూర్తిచేయడం.. గ్రామాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు జిల్లా స్వరూపాన్నే మార్చడానికి తాను చేస్తున్న అలుపెరుగని కృషికి తగ్గ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అందునా నీతీ ఆయోగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశంలోనే మౌళిక సదుపాయాల కల్పనలో నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చి గౌరవించాయంటే దానివెనుక దాగి ఉన్న శ్రమ, పట్టుదల, కృషి ఏపాటి నేడు వచ్చిన కీర్తి, గౌరవమే దానికి తార్కాణం.
-ప్రభుత్వ సేవలు ప్రజలకి తెలిసేలా మీడియా, సోషల్ మీడియా ప్రచారం.. జర్నలిస్టులకు గుర్తింపు
అల్లూరి జిల్లా కలెక్టర్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో దిట్ట అనే విషయం ప్రభుత్వ సేవలు ప్రజల్లోకి ఇట్టే తీసుకెళ్లేందుకు ఆమె ఎంచుకున్న మార్గం మీడియా, సోషల్ మీడియా.. ఈ వేధికల ద్వారా ఆమె అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రభుత్వం చేసే పనులను ప్రత్యేకంగా వీడియోలు తీయించి వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేయడంతో జిల్లాలోని అన్ని మండాలాల నుంచి ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలంటూ పీజీఆర్ఎస్ కార్యక్రమాలకు వస్తున్నారు. సాధారణంగా అయితే ప్రభుత్వ అధికారులు చేసేది తక్కువ.. ప్రచారం ఎక్కువగా చేసుకుంటారు.. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం ప్రజలకు ఏదైతే అవసరమో దానినే మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన జిల్లాలో మీడియా గుర్తింపు కోసం కూడా జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేసే విషయంలో కూడా ఎంతో హుందాగా వ్యవహరించి జిల్లాకి మీడియా పరంగా కూడా గుర్తింపు తీసుకు రావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలోని మీడియాలో పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా వారంతా మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలో ప్రజల సమస్యలు, అభివృద్ధి, జరగబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేతుందనేది జిల్లా కలెక్టర్ నిషాంతి భావనగా కనిపిస్తున్నది.
-అర్జీదారులకు అన్నం పెట్టే మనసున్న అమ్మగా
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారందరికీ ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్నాక్యాంటీన్ సౌకర్యంతో ఆమే స్వయంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలోనూ ఆమే స్వయంగా అర్జీ దారులకు వడ్డిస్తూ కడుపునిండా అన్నం పెడుతున్నారు. దానితో చాలా సమస్యలతో వచ్చే వారికి జిల్లా కేంద్రంలో దొరికే చిన్న ఉపసమనంతో వారి మనసులో ఉండే వేదన, బరువు తీరినట్టు అవుతున్నాయి. అంతేకాదు..అర్జీల ద్వారా వచ్చే కీలక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల రూపు రేఖలను మార్చడానికి జిల్లా కలెక్టర్ వేస్తున్న సుదీర్ఘ ప్రణాళికతో తరచూ వసతి గృహాల్లో సందర్శనలు చేయడం ద్వారా పిల్లలకు అక్కడ నాణ్యమైన ఆహారం అందించే కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ వస్తున్నారంటే పిల్లలకు పెట్టే ఆహారం తేడాగా వుంటే తమపై చర్యలుంటాయని భావిస్తున్న వార్డెన్లు మెనూని సక్రమంగా అమలు చేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా కలెక్టర్ గా విధుల్లోకి చేరిన దగ్గర నుంచి తన దృష్టంతా జిల్లా అభివృద్ధి.. అన్ని రంగాల్లోనూ గిరిజనులను గౌరవంగా చూడటం, వారికి మౌళిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకి సాగుతుండటంతో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు నేడు జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చి కీర్తించాయి. జాతీయ స్థాయిలో వచ్చిన ఈ గుర్తింపుతో జిల్లాలోని అన్ని మండలాలు.. అన్ని గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలు అంది, ప్రభుత్వ పథకాలు చేరి.. గ్రామాలు కూడా అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే విధంగా విజన్ ఉన్న కలెక్టర్.. ముందుడుగు వేయాలని ఆశిద్దాం..!




