(ఈరోజు-అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక అధ్యయనం అయిపోయింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక ప్రభుత్వశాఖ ద్వారా నియమితులనై ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది మంత్రులతో కూడిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కావడం..వారంతా ఎలాంటి అధ్యయనాలు, నిర్ణయాలు తీసుకోకుండా నెలల తరబడి కాలయాపన చేయడం ఇపుడు చర్చనీయాంశం అతుంది. ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. నేటికీ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటో చెప్పలేని స్థితిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు కారాలు, మిరియాలు నూరుతున్నవేళ అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించినా.. అందులో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉందో లేదో తెలియని డోలాయమానంలో పడిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.20 లక్షల మంది ఉద్యోగులు. వాస్తవానికి రాష్ట్రంలోని ఏదైనా ఒక జీఓ వస్తే అది 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేయాలి. విచిత్రం ఏంటంటే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి అధికారులు ఈ శాఖకు సంబంధం లేదన్నట్టుగా ప్రక్కన పెడుతూ వచ్చింది. ఆ విధానాలను రాజకీయం కోసం అసెంబ్లీ సాక్షిగా వాడేసుకున్న కూటమి ప్రభుత్వం కూడా ప్రయోజనం ఇవ్వాల్సి వస్తే దానికి బూచీగా గద ప్రభుత్వాన్ని చూపిస్తూ.. లేదంటే అద్యయన కిమిటీని చూపిస్తూ కాలం వెళ్ళ దీస్తూ వస్తున్నది. అదే సమయంలో ప్రభుత్వానికి అవసరం వస్తే మాత్రం రాత్రికి రాత్రి జిఓలు వచ్చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే.. పరిపాలనా సౌలభ్యం అనే సాంకేతిక కారణాన్ని చూపిస్తున్నది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిన వేళ కోర్టు కేసులతో ఇప్పటికీ ప్రభుత్వశాఖ లేకుండా అనధికారికంగా పోలీసుశాఖలోనే ఉన్న మహిళా పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
పోలీసుశాఖకు మహిళా పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన రాష్ట్రప్రభుత్వం వీరికి ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వశాఖలు ఎంచుకోవాలని ఆప్షన్లు ఇచ్చింది. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కేవలం 25 శాతం మంది మాత్రమే రెండు డిపార్ట్ మెంట్ ఆప్షన్లు ఎంచుకున్నారు. అలా ఎంచుకున్నవారిని ఏం చేస్తారో కూడా రాష్ట్రప్రభుత్వం ఏమీ చెప్పలేదు. మరోవైపు అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టులను మాత్రం తయరు చేస్తున్నది. ఆలు లేదు సూలు లేదు.. కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా రాష్ట్రప్రభుత్వంలో ఎంతో సీనియారిటీ ఉన్న అఖిలభారతస్థాయి అధికారులు కూడా దేశంలో ఎక్కడా లేని పరిపాలన ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే తేడా చేయడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. అన్ని ప్రభుత్వశాఖలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినా..ఆ ప్రయోజనాలు తమవరకూ వచ్చే పరిస్థితి లేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తున్నందున.. పదోన్నతులు కేవలం ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులకు మాత్రమే ఇస్తారని అంటున్నారు. దానికి తోడు ఇదేశాఖల్లోని ఉద్యోగులు కూడా వేల సంఖ్యలో ఉద్యోగ విరమణలు చేస్తున్న వేళ.. అక్కడ ఏర్పడ్డ ఖాళీలను సచివాలయ ఉద్యోగులతో అదనపు డెప్యుటేషన్లు వేసి మరీ భర్తీచేయాలని చూస్తున్నది. దానికోసం ఇప్పటికే సుమారు 17వేల మంది సిబ్బందిని ఆయా ప్రభుత్వశాఖల్లోకి పంపందుకు రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసింది. అలా పంపినా కేవలం అదనపు పనుల కోసం మాత్రమే అలాగని వాళ్లని పంపుతున్న శాఖల్లోకి విలీనం చేయరు. ఆశాఖలో ఇస్తున్న ప్రయోజనాలూ ఇవ్వరు.
కేవలం సచివాలయశాఖలో మిగులు సిబ్బంది ఉన్నారని చూపిస్తూ.. వారిని ఇతర శాఖల్లోకి పంపేయత్నం చేస్తున్నది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వ నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తారా..? చేయారా అన్నది..తేలాల్సి వుంది. మరోప్రక్క తమను అన్నిపనులకూ తెగవాడుకొని తమకు రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వమంటే ప్రభుత్వం చూపిస్తున్న సాకులకు మాత్రం ఖచ్చితంగా సరైన సమాధానం చెబుతామని ఉద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తుందనేది వేచి చూడాలి..?!




