(ఈరోజు-అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కూటమి ఏం చేసినా అది చిరిగి చేటంతై.. చాపంత అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగిందని అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా రచ్చ రచ్చచేసిన కూటమి వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు, ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తుందనుకున్నారు. యాద్రుచ్చికంగా ఉద్యోగుల మైండ్ డైవర్ట్ చేయడానికి మంత్రు కమిటీని తెరపైకి తీసుకు వచ్చింది. అయితే ఆ కమిటీ ఏ విషయమూ అధ్యయనం చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ఉద్యోగులు కాస్తా ప్రభుత్వానికి అర్జీలు విసిగిపోయి హైకోర్టుని ఆశ్రయించారు. ఉద్యోగులు హైకోర్టుకి వెళితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 309, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్, రూల్ 28 ఆధారంగా పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుందని.. అలా కాకుండా అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాత వెంటనే పదోన్నతులు ఇస్తే కూటమికి కలిసొస్తుందని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు కూడా వెలువరించింది. అయితే కేవలం రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తేనే 1600 కోట్లు ఖర్చు అవుతుందని.. ఆభారం మోయలేక ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి తప్పించుకోవాలని చూసిన ప్రభుత్వానికి గ్రామా, వార్డు సచివాయశాఖ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం) అధికారులకు హైకోర్టులో చుక్క ఎదురైంది. ఉద్యోగులువేసిన కేసుపై పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఇంక్రిమెంట్లతో కూడి పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించింది.
-తిరకాసంతా జిల్లా కలెక్టర్ల వద్దనే జరిగింది(డిఎస్సీ చైర్మన్)
గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగాల భర్తీ సమయంలో అన్ని పనులూ జిల్లా కలెక్టర్లే చూసుకున్నారు. డిఎస్సీ కమిటీ చైర్మన్ గా నియామకాలు, బదిలీలు, తప్పు చేసిన ఉద్యోగులపై సస్పెషన్లు అన్నీ కలెక్టర్లే చూసుకొని.. తీరా ఇదే ఉద్యోగులు సీనియారిటీ జాబితాలు తయారు చేయడంలోగానీ.. ఆర్టికల్ 309, రూల్ 28 ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం మాకు ఏమీ చెప్పకుండా చేయలేం అన్నట్టుగా మిన్నకుండి పోయింది. దానితో ఉద్యోగులు జిల్లా కలెక్టర్లు, మంత్రులు, సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్లకు అర్జీలు ఇచ్చి ఇచ్చి విసుగు చెంది హై కోర్టులో కేసులు వేశారు. దీనితో హైకోర్టు సచివాలయ ఉద్యోగులకు తక్షణమే ఇంక్రిమెంట్లతో కూడా పదోన్నతులు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చింది. అయితే ఎలాగైనా ఆర్ధిక భారం నుంచి తప్పించుకోవాలని చూసిన రాష్ట్రప్రభుత్వం, సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇపుడు కోర్టు ఉత్తర్వు గొంతులో పచ్చివెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. ఇదే అంశాన్ని 2022 నుంచి వీరికి రావాల్సిన 9నెలల పేస్కేలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు, తదితర అంశాలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. అయితనా ప్రభుత్వం ఒకేసారి 1.25 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనాలు అంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం అనుకొని ఇవ్వడం మానేసింది.
-ప్రస్తుతం ఉన్న కోర్టు కేసుల్లో మరికొందరు ఉద్యోగులు ఇంప్లీడ్
ఇప్పటికే మహిళా పోలీసుల నియామకాలు, ఉద్యోగుల పదోన్నతుల అంశంపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇపుడు హైకోర్టు ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో డైరెక్షన్స్ ఇవ్వడంతో ఇప్పటికే ఉన్న కేసుల్లో కూడా ఉద్యోగులు ఇంప్లీడ్ అయ్యి తమకు జరిగిన అన్యాయంపై కోర్టు ద్వారా పోరాడేందుకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఒక కేసు విషయంలో సూటిగా ఆదేశిలిచ్చిన హైకోర్టు.. మిగిలిన కోసుల విషయంలో డైరెక్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బలు తగలక తప్పదు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ తో పదోన్నతులు కల్పిస్తుందా.. గాల్లో ప్రభుత్వశాఖ లేకుండా పెట్టి మహిళా పోలీసులకు ఇచ్చిన ఆప్షన్లకు మారుస్తుందా.. ఇంక్రిమెంటుతో కూడిన పదోన్నతి కల్పిస్తుందా.. లేదంటే ఇపుడు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పునే మళ్లీ కోర్టుకి అఫడివిట్ రూపంతో దాఖలు చేస్తుందా..లేదంటే పదోన్నతుల కోసమే ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అనేవిషయం తేలాల్సివుంది..!




