(ఈఎన్ఎస్-విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం)
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మళ్లీ రోడ్డొక్కబోతున్నారు..రాష్ట్ర రాజధాని నగరం వేదికగా ఆవేదన దీక్ష చేపట్టబోతున్నారు.. ఛలో విజయవాడ పేరిట ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసి పిలుపు నిచ్చింది. దానితో రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.20లక్షల మంది ఉద్యోగులను సమీకరించడానికి ఉద్యోగుల నెట్వర్క్ వేగంగా పావులు కదుపుతోంది..ఏడేళ్లుగా వివక్షకు గురైన తమకు న్యాయం చేయకపోతే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఉద్యోగులు ఈ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు..ఒకేసారి విధుల్లోకి చేరిన ఉద్యోగులను విడదీసి ప్రత్యేకంగా చూసి తమ భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతుందని ఉద్యోగులు ఒంటికాలిపై లేస్తున్నారు..ఇప్పటికే తమను ఇంత బాధపెట్టిన కూటమి ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెబుతామని ప్రకటించిన ఉద్యోగులు.. ఇపుడు రాష్ట్ర రాజధాని నగరం వేదిక చేయబోయే ఆందోళన దీక్షతో తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డారు.

భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక ప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, నోషల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వకుండా ఏడేళ్లపాటు రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్న ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఏపీలోనే ఐఏఎస్ అధికారులు 75వ ప్రభుత్వశాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం) పరిపాలను అత్యంత దారుణంగా చేస్తున్నారు. దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాతృశాఖల్లోని ఉన్న ప్రయోజాలు రెగ్యులర్ ఉద్యోగులకు అమలు చేయకుండా.. అధ్యయనం పేరుతో నెలలు తరబడి తాత్సారం చేయడం దేనికి సంకేతమో చెప్పాలంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అసలు 74 ప్రభుత్వశాఖల్లో లేని విధంగా ఒక్క 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఎందుకు వివక్షతో చూస్తున్నారో చెప్పాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆఖరికి అన్ని శాఖల ఉద్యోగులు వారి పని వారు చేసుకుంటే ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాల పనులు.. నిబంధలనకు విరుద్దంగా ఎన్నికల కమిషన్ విధులు చేస్తున్నా రాష్ట్రప్రభుత్వం మనసు మాత్రం కరగడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆదేదనను రాష్ట్రరాజధాని ప్రాంతం వేదికగా దీక్ష చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తే అపుడైనా తమ సమస్యలు, డిమాండ్లు తెలుస్తాయని ఉద్యోగులు వాపోతున్నారు.

దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేనివిధం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఒక తేడా ప్రభుత్వ శాఖ ఏర్పాటైందని.. 74 ప్రభుత్వశాఖలు వారి వారి శాఖల విధులు నిర్వహిస్తుంటే ఒక్క 75వ ప్రభుత్వశాఖ ఉద్యోగులు మాత్రమే అన్ని శాఖల పనులూ చేయాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. అదేసమయంలో అధికారుల వేధింపుల కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ఉద్యోగులు విధి నిర్వహణలోనే మృత్యువాత పడ్డారని చెబుతున్నారు. మరికొందరు విద్యుత్ లైన్లపై గాయపడి మంచాలకే పరిమితం అయ్యారని వారికి ఎలాంటి నష్టపరిహారం గానీ, కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు గానీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కానీ ప్రభుత్వానికి నచ్చినట్టుగా రాత్రికి రాత్రే గ్రామ, వార్డు సచివాలయశాఖ పేరుని స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డుగా మార్చేసిందని.. రాత్రికి రాత్రే రేషనలైజేషన్ చేసి, క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగులను కుదించేసిందని మండి పడుతున్నారు. వీటన్నింటికీ నిబంధనలు వర్తించినపుడు తమ మాతృశాఖలకు తమను అటాచ్ చేయడానికి నిబంధనలు లేవా..? దానికి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్ కి అధిపతి, ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ కూడా సచివాలయశాఖ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం పై రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం దారుణమని మండి పడుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు..

ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలతో కాలయాపన ఆపాలని..ఏడేళ్ల నిరీక్షణకు న్యాయం చేయాలని..ఏఏఎస్, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని.. తక్షణమే సర్వీసు రూల్స్ ఏర్పాటు చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని..ఐవీఆరఎస్ సస్పెనాన్లు రద్దు చేయాలని..పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలని.. సర్వీసు రెగ్యులరజేషన్ సమయంలో అదనంగా పనిచేయించుకున్న 9తొమ్మిది నెలల కాలనాకి పేస్కేలు అరియర్స్ గా ఇవ్వాలనే డిమాండ్లతో సచివాలయ ఉద్యోగుల ఆవేద దీక్ష చేపడుతున్నట్టు రెండు రోజుల భారీ నిరాహా దీక్ష చేపడుతున్నట్టు సంఘం చైర్మన్ బూరాడ మధుబాబు పేర్కొన్నారు. అంతేకాకుంగా స్వచ్చందంగా ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్ద పడుతున్నారు. న్యాయబద్దమైన సచివాలయ ఉద్యోగుల నిరాహార దీక్షపై అపుడే ప్రభుత్వం ఆ రెండురోజులకి ప్రత్యేక విధులు ఉద్యోగులకు అప్పగించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఉద్యోగులను బెదిరించడానికి కొందరిని సస్పెండ్ కూడా చేసింది. అయినా తమ సమ్యలు పరిష్కారం అయ్యేవరకూ తగ్గేదేలేదని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. చూడాలి సచివాల ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనేది..!