(ఈరోజు-అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి)
జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణణ్ అంటే ఇపుడు పరిచియం అక్కరలేని పేరుగా జిల్లా ప్రజల్లోనే కాదు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వంలోనూ గుర్తింపు వచ్చింది. అలుపెరగని ప్రజా సేవ, ప్రభుత్వ సూచించిన అంశాలను త్వరిత గతిన క్లియర్ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం, పీజీఆర్ఎస్ లో సమస్యల పరిష్కారం ఇలా అన్ని రంగాల్లోనూ కలెక్టర్ విజయ క్రిష్ణణ్ చేస్తున్న సేవలు ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రభుత్వసూచిల పనితీరులో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపించింది. ఈ మేరకు రాష్ట్రముఖ్యమంత్రితో ప్రశంసలు అందుకొని మరోసారి వార్తల్లో నిలిచారు అనకాపల్లి జిల్లా కలెక్టర్.
ఒక అధికారిగా కాకుండా ఒక టీమ్ నెట్వర్క్ గా ఆమె చేస్తున్న కృషికి ఈ గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. ప్రజలకు సేవలు చేయడం, జిల్లా పరిశ్రమల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడం, స్థానిక యువతకు ఉపాది కల్పించడం, ఆశ్రమ పాఠశాలల్లో చెత్త ద్వారా సంపద సృష్టించడం వంటి కార్యక్రమాలు ఆమె విధినిర్వహణలో ఆమెను ఎవరెస్టు అంత గౌరవాన్ని తీసుకొచ్చిన అంశాలు. ఇటు ప్రజల్లోనూ.. అటు ప్రజాప్రతినిధుల్లోనూ.. మరోవైపు ప్రభుత్వంలోనూ కలెక్టరమ్మ సేవలు అందరూ కీర్తించిన వారే ఉండటం ఆమె పనితీరుకి నిదర్శనం. తాజాగా ప్రభుత్వ సూచీల అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ప్రధమ స్థానంలో నిలబెట్టి అనకాపల్లి జిల్లా పేరుని అన్ని జిల్లాల కలెక్టర్లు తలచుకునేలా చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు.
ఇటు వర్కింగ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డు ప్రీమియంకి సీఎస్ఆర్ నిధుల నుంచి మొత్తం చెల్లించడంతో పాటు.. మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందించడంలోనూ కలెక్టర్ ఎల్లప్పుడూ ముందుంటున్నారు. దానికి జిల్లా సమాచారశాఖ అధికారులు కూడా తోడవడంతో ఆమె ఏ కార్యక్రమం తలపెట్టినా అది ప్రజల్లోకి, ప్రభుత్వం దృష్టికి నేరుగా వెల్లడానిక అకాశం ఏర్పాడ్డాయి. ఒక అధికారి ఒక అంశంలో గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణణ్ మల్టీ టాస్క్ మేనేజ్ మెంట్ ఆఫీసర్ గా నేడు అన్ని వర్గాల్లోనూ గుర్తింపు తెచ్చుకొని జిల్లాకు కూడా మంచి పేరు తీసుకొచ్చి.. ఆమె పనిచేసిన కాలానికి ఒక హిస్టరీ మైల్ స్టోన్ క్రియేట్ చేస్తున్నారు.
-జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణణ్ కు అధికారుల ఘన సన్మానం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మే 7, 8 తేదీలలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో వివిధ కీలక పనితీరు సూచికలు , ఇతర ప్రమాణాల్లో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానం సాధించడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. జిల్లా అభివృద్ధి, పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ గారిని జిల్లా అధికారులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషితో ముందుకు సాగిన అన్ని శాఖల అధికారుల సమన్వయం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఇదే స్పూర్తితో మరింత కృషి కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, రోడ్లు భవనాలు ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.సాంబశివరావు, ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు, డెప్యూటీ సిఈఓ రాజ్ కుమార్, డి.ఆర్.డి.ఎ పీడి శచీదేవి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం అశాదేవి, డ్వామా పీడీ నిర్మలా దేవి తదితరులు ఉన్నారు.




