(ఈరోజు-అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి పాడేరు, అమరావతి)
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ(స్వర్ణవార్డు, స్వర్ణ పంచాయతీ) ఉద్యోగులకు ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులమాదిరిగా ప్రయోజనాలివ్వాలంటే మంత్రుల కమిటీ అధ్యయం చేస్తుందని చెబుతున్న ప్రభుత్వం అధికారులు.. ప్రభుత్వానికి అవసరం అనుకుంటే మాత్రం ఎలాంటి అధ్యయనం లేకుండానే జీఓలు జారీ చేస్తున్నది. రాష్ట్రంలో 74 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు వేల సంఖ్యలో ఉద్యోగ విరమణ చేస్తున్న వేళ ఆయా శాఖల్లో భారీగా ఏర్పడుతున్న ఖాళీలను సచివాల ఉద్యోగులతోనే అదనపు విధులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏం చేయాలన్నా అధ్యయనం చేయాలని చెబుతున్నారని.. అలాంటపుడు ఏ సర్వీసు నిబంధనల ఆధారంగా కేవలం అదనపు పనులు, సర్ధుబాటు కోసం ఉద్యోగులను ఇతర శాఖలకు పంపుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో మళ్లీ తమకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు.. 9నెలల పేస్కేలు బకాయిలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు, మాతృశాఖల్లో విలీనం, జూనియర్ అసిస్టెంట్ పేస్కేఅలు అడిగితే మాత్రం మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తుందని.. ఆ నివేదికలు వచ్చే వరకూ ఏమీ చెప్పలేమని చెప్పడం విడ్డూరంగా వుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం కూడా తమకు రానున్నరోజులో ఏం చేయాలో చెప్పకనే చెబుతున్నదని అంటున్నారు. ఇలాంటి పరిపాలన తమకు కావాల్సిందేనని.. నమ్మి ఓట్లేసినందుకు ఇపుడు అనుభవించాల్సి వస్తుందని.. కానీ ఇంతలా చేసిందనందుకు, తమను రాజ్యంగానికి వ్యతిరేకంగా విధులు నిర్వహించేలా చేయడం, అదనపు పనులు అప్పగించి లక్ష్యాలు పూర్తి కాకపోతే కావాలని వేధించడం, ఆత్మహత్యలు చేసుకునే లా ఉరిగొల్పడం ఇవన్నీ ఊరకనే పోవని బాహాటంగానే చెబున్నారు. అంతేకాదు ఏడేళ్లుగా తాము ఎన్ని ప్రయోజనాలకు దూరమయ్యాయో త్వరలోనే కూటమి కళ్లు తెరిచేలా తెలియజేస్తామని అంటున్నారు.
-కూటమి ప్రభుత్వం పరువు పోగొడుతున్న ఉన్నతాధికారులు
అన్నీ నిబంధనల ప్రకారమే చేస్తున్నట్టు కలర్ ఇస్తున్న అధికారులు.. మరి ఉద్యోగులకి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఒకలా.. వేల సంఖ్యలో ఖాళీ అవుతున్న ప్రభుత్వశాఖల్లో సిబ్బందిని సర్ధుబాటు చేయాలంటే ఒకలా వ్యవహరించడంతో ప్రభుత్వం పరువుపోయినంత పనవుతుంది. సాధారణ ప్రజలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, అందునా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అధికారులు చేస్తున్న తేడా పరిపాలన విషయంలో ఆలోచించేలా చేయడం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. అంతేకాదు. అన్నింటికీ నిబంధనలు ఉన్నట్టు.. ప్రభుత్వం ఇచ్చే జీఓలకు, ఉద్యోగులకు ఏ ప్రయోజనాలు కల్పించకుండా వదిలేయడానికి కూడా అదే నిబంధనలు వర్తిస్తాయి కదా అనే చర్చకు తెరలేపారు.
అసలు ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులకి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి ఏం తేడా ఉందని.. ఇతర శాఖల ఉద్యోగులు వారి పనులు మాత్రమే చేస్తుంటే.. సచివాలయ ఉద్యోగులు మాత్రం వీరి పనులతోపాటు ఇతర శాఖల పనులు.. ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ బుక్ నిబంధనలకు విరుద్దంగా బిఎల్వో విధులు చేయడం కూడా కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న నిబంధనలేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే కూటమి ప్రభుత్వానికి ఉన్న పరిపాలన పేరు కావాలని అధికారులే చెడగొడుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుందని.. ఈ విషయంలో ఉద్యోగులు ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేస్తే దాని ఫలితాలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే గట్టిగా వస్తాయని విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు.




