(ఈరోజు-ప్రధాన ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయ ఉద్యోగుల కూటమి ప్రభుత్వంపై తిరుబాటు చేయకుండా..ఆగ్రహం వ్యక్తం చేయకుండా పదోన్నతుల మెమో అనే నీళ్లు చల్లి ఊరుకుంది కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ రివర్స్ పేస్కేలు ఇచ్చినా సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించే పరిస్థితి లేదు. కారణం ఉన్న ఉద్యోగుల్లో నాలుగు ప్రభుత్వ శాఖలకు వారు ఊహించిన దానికంటే అధిక పేస్కేలు రావడం.. కొన్ని శాఖల ఉద్యోగులకు ఇపుడు తీసుకుంటున్న పేస్కేలు కంటే తగ్గిపోవడం.. మరికొందరికి ఇంకా పేస్కేలు, ప్రమోషన్ సెట్ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల ఓట్లు రావాలంటే.. ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తే ప్రభుత్వంపై సింపతి పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కడతారని ప్రభుత్వం కూడా తేడాగా ఆలోచించడం కూడా ఉద్యోగుల తిరుగుబాటుకి కారణం అవుతున్నది.
రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలుంటే ఒక్క 75వ ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా ఉన్న స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కాస్త తేడాగా వ్యవహరించడం ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కలిసి మాత్రం ప్రయోజనాలు సాధించే పనికి పూనుకోవడం లేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న పేస్కేలు కంటే తగ్గించి ప్రమోషన్ తో కూడిన పేస్కేలు ప్రతిపాదన మెమో రూపంలో జారీ చేసినా.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని సరిపెట్టుకోవడం తప్పా.. ఇంటేంటని ఒక్కరంటే ఒక్కరూ కూడా ప్రశ్నించడానికి ముందుకి రావడం లేదు. వస్తే అధికారులు పెట్టే టార్చర్, వేధింపులు, అధిక పనిభారంతో విధినిర్వహణలోనే గాల్లో కలిసిపోయిన సహచర ఉద్యోగుల ప్రాణాలు గుర్తొస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంశాన్ని ఒక్కసారి కూడా క్యాబినెట్ పూర్తిస్థాయిలో చర్చించలేదంటే పరిస్థితి ఎంత తారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరికి ఆర్ధిక ప్రయోజరాలు ఇవ్వడానికి చర్చించకపోయినా.. ప్రజలకు అందించేసేవలు, ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలు, బిఎల్వో విధులు, ఎస్ఐఆర్ డ్యూటీలు, అన్ని చేయడానికి వీరినే కనీసం ఆదివారాలు, రెండవ శనివారాలు ఖాళీ లేకుండా వాడేస్తుండటం విశేషం. ఉద్యోగుల్లో లేని ఐకమత్యం కూడా ప్రభుత్వానికి విభజించి పాలించడానికి.. కేవలం ప్రకనలు చేసి..మెమోలు జారీ చేసి ఊరుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా..ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదంటే.. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయో.. లేదంటే మెమోలు రూపంలోనే సాంకేతిక కారణాలు వంకతో నిలిచిపోతాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాల్సి వుంది..?!




