(ఈరోజు-విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం)
గ్రామ, వార్డు సచివాలయం(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం) ఉద్యోగుల సమస్యలపై పోరాటమనే విల్లుని ఎక్కుపెట్టే విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ మధు బూరాడ అంటే అంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే తెలియని వారుండరు. ఈ యన ఓదార్పుయాత్రికి పిలుపు ఇవ్వగానే వ్యవసాయశాఖలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ అధికారులు పెట్టే వేధింపులకు తట్టుకోలేక సూసైట్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న సీరా రాఘవకు రూ.25 వేలు మట్టి ఖర్చుల క్రింద వేయడంతోపాటు.. మధుబాబు చేపట్టే నేనున్నాననే ఓదార్పు యాత్రకి వెళ్లవద్దని పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు నేరుగా మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఫోన్లు చేసి మరీ వివరాలు కనుక్కుంటున్నాయంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి సచివాలయ ఉద్యోగులందరూ. ఇది నేనున్నానని ఓదార్పుయాత్ర తొలిరోజే విజయం గానే చెప్పాలి.. ఇన్నేళ్లు గుర్తుకు రాని సచివాలయ ఉద్యోగుల మృతుల కుటుంబాలు.. ఇపుడు బూరాడ పిలుపునిచ్చిన ఓదార్పు యాత్రతో ఎందుకు గుర్తుచేసుకుందనే విషయాన్ని కూడా ఉద్యోగులందరూ ఒక్కసారి మననం చేసుకోవాల్సి ఉంది.
ఉద్యోగుల సమస్యపై రెండు రోజులు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు పోలీసుశాఖకు దరఖాస్తు చేస్తే అనుమతిని నిరాకరించిన పోలీసులు. ఇపుడు ఓదార్పు యాత్రను కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు.. ఆయా కుటుంబాల సభ్యులకు ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు పోన్లు చేసి బూరాడ చేపట్టే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే ఇక్కత తాను ప్రభుత్వం ఇచ్చిన సెలవు రోజుల్లోనే ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నానని స్పష్టం చేస్తున్నారు నేనున్నానని ఓదార్పు యాత్ర నిర్వాహకులు బూరాడ మధు. ఏ రకంగానూ బయటకు వెళ్లకుండా చేసేందుకు రాష్ట్రప్రభుత్వ అన్ని ప్రయత్నాలూ ప్రారంభించింది. ఇప్పటి వరకూ 15 నెలలు జీతం కూడా ఇవ్వని వ్యవసాయశాఖ ఇప్పటికిప్పుడు సుమారు రూ.5 లక్షలు పోగు చేసి మృతుని కుటుంబానికి ఇవ్వడానికి కూడా చక చకా పావులు కదుపుతుంది. అంటే ఇక్కడ నేనున్నాని..ఓదార్పు యాత్ర ఏ స్థాయి ప్రకంపనలు సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మృతుల కుంటుంబాలు మాత్రం ప్రభుత్వం, పోలీసులు చేసే హెచ్చరికలను ఎక్కడా పట్టించుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు చూపించే ఆదారాభిమానాలకే పెద్ద పీట వేస్తున్నారు.
-ఒక్క పిలుపుకే భారీ స్పందన..ఉద్యోగులందరూ కలిస్తే..
సచివాలయంలో పనిచేస్తూ మృతిచెందిన కుటుంబాలను ఓదార్చడానికి వెళుతున్నట్టుగా చేసిన ఒక్క పిలుపునకే టక్కున స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరూ కలిసి కట్టుగా ఒక్క మాటమీదకు వస్తే.. ఏళ్ల తరబడి పరిష్కరానికి నోచుకోని సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయనడంతో ఎలాంటి సందేహం లేద అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకు వెళ్లడంలోనూ తమవంతు సహకారం అందిస్తామని కూడా చెబుతున్నారు. అందునా 2019 నుంచి నేటి వరకూ అలుపెరగకుండా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తెలిసేలా ప్రత్యేక వార్తా కథనాల అస్త్రాలను ఎక్కు పెట్టిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజీన్సీ, ఈరోజు దినపత్రిక సేవలను కూడా కొనియాడుతున్నారు. నేనున్నాను అనే ఓదార్పు యాత్రలో ప్రతీ ఒక్క సచివాలయ ఉద్యోగి స్వచ్చందంగా వచ్చి సంఘీభావం తెలపడం కోసం మధుబాబు వేసిన ఒక్క అడుగులో మిగిలిన వారంతా జతకలుస్తున్నారు. ఈ సచివాలయ ఉద్యోగుల ఐక్యత ప్రభుత్వానికి తెలియడం ద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం వుంటుంది. నేటి తొలి ఓదార్పుని పోలీసులు, ఇంటెలి జెన్స్ నిర్వహించేలా చేస్తుందా.. లేదంటే భగ్నం చేస్తుందా అనేది వేచి చూడాలి..?!




