సాధారణంగా ప్రభుత్వ అధికారులు.. అందునా ఐఏఎస్ అధికారులంటే పరిపాలన వ్యవహారాలు చూసుకొని వాయువేగంతో కార్యాలయాలకు చేరుకుంటారు. కానీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణణ్ అలా కాదు. ఏ ప్రాంతానికి పర్యటకు వెళ్లినా తొలి అడుగు నుంచి గమ్య స్థానం చేరుకునేంత వరకూ ఆ ప్రాంతాలన్నీ అవపోసన పడతారు. ప్రతీ విషయాన్ని పట్టి పట్టి గమనిస్తారు.. అలా గమనించిన సమయంలోనే ఆ ప్రాంతానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే ఆలోచనలతోనే ముందుకి సాగుతారు. అలా శుక్రవారం మాడుగులలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ముగించుకొని వస్తున్న సమయంలో బంగారు మెట్టవద్ద చినుకులు పడుతున్న సమయంలో బస్సుకోసం వేచి చూస్తున్న విద్యార్ధులు ఆమె కంట పడ్డారు. అంతే రయ్ మంటూ వాయు వేగంతో వెళ్లే కలెక్టర్ కాన్వయ్ ఆ విద్యార్ధుల వద్ద ఆగింది.. ‘వర్షంలో నానుతూనే ఉండిపోయారు.. ఎక్కడికి వెళ్లాలి అనగానే.. మేము చిన్నప్పపాలెం వెళ్లాలండీ.. బస్సు కోసం చూస్తున్నాం.. ఇంకా బస్సు రాలేదు అనే సమాధానం వచ్చింది’,.. అయ్యో వర్షం పడుతుంది.. తడిచిపోతున్నారు.. అలా వర్షంలో తడిస్తే జర్వం వచ్చేస్తుంది.. ముందు కారెక్కండి.. అంటూ చిన్నారులను కారులోకి ఎక్కించారు. ఆ చిన్నారులకు అర్ధం కాలేదు..ఎవరో వచ్చి కారు ఎక్కమంటే ముందు భయపడిన చిన్నారులు.. కాస్త జంకారు.. దానితో కారులోని గన్ మేన్ లు కలుగజేసుకొని.. పిల్లలూ మేడమ్ ఎవరనుకున్నారు.. మన జిల్లా కలెక్టర్ గారు.. మీకోసమే కారు అపారు అనగానే.. పిల్లల మొహాల్లో ఒక్కటే ఆనందం.. వెంటనే కారులోకి ఎక్కి కూర్చన్నారు.
ఈ తంతు అంతా చూస్తున్న అధికారులు, సమాచార శాఖ అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏంటి కలెక్టర్ మేడమ్ ఆ చిన్నారుల కోసం కారు ఆపడమేంటని మాట్లాడుతుండగానే.. అందులో ఉన్న సమాచారశాఖ సిబ్బంది, ఆ వెనుకనే ఉన్న ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధులు తమ కెమెరాలకు పనిచెప్పారు.. జిల్లా కలెక్టర్ చేస్తున్న మంచి పనిని తమ కెమెరాల్లో బందిస్తున్నారు. అదంతా చక చకా జరిగిపోయింది. పిల్లలు కారులోకి ఎక్కారు. కారు అక్కడి నుంచి రయ్ మంటూ చిన్నప్పపాలెం గ్రామానికి చేరుకుంది. అక్కడ కలెక్టర్ కారులోని నుంచి స్కూలు విద్యార్ధులు దిగుతుంటే అక్కడి గ్రామస్తులకు కూడా ఏమీ అర్ధం కాలేదు.. వెంటనే చిన్నారులు.. మమ్మల్ని కలెక్టర్ మేడమ్ కారులో ఎక్కించి తీసుకొచ్చారు.. మేము వర్షంలో బస్సుకోసం వేచి వుంటే.. మేడమ్ మా దగ్గర కారు ఆపి మమ్మల్ని గ్రామం వరకూ తీసుకొచ్చారని చెప్పడంతో చిన్నప్పపాలెం గ్రామస్తులు.. కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. పిల్లలన్ని గ్రామంలో దించిన కలెక్టర్ వారితో మాట్లాడుతూ.. వెంటనే ఇంటికి వెళ్లి తలతుడుచకోండి లేదంటే జలుబు చేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయాన్ని క్షణాల్లో గ్రామం మొత్తం చెప్పా వరకూ తీసుకొని వెళ్లి అక్కడ విద్యార్ధుల గ్రామంలో దించి వారికి జాగ్రత్తలు చెప్పారు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులు, కలెక్టర్ కాన్వాయ్ వెనుక వస్తున్న అధికారులు మంచి మనసున్న కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె కీర్తించారు. కలెక్టర్ చేసిన మంచి పనిని ఆమె కాన్వయ్ తో వస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధులు క్షణాలో ఆ విషయాన్ని www.eeroju.com ద్వారా సోషల్ మీడియాలోకి ఎక్కించారు. అంతే విషయం కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది.
విధి నిర్వహణలోనే కాకుండా మానవత్వంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మంచి మనుసుని పలుమార్లు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు-ఈఎన్ఎస్ మరోసారి నిశ్వార్ధంగా ఆలోచించి.. అమ్మ మనసుని ప్రదర్శించి చిన్నారులకు లిఫ్ట్ ఇచ్చిన అంశాన్ని కూడా కలెక్టర్ కాన్వయ్ విద్యార్ధుల దగ్గర ఆగిన దగ్గర నుంచి వారిని దించి.. అధికారులు, ప్రజలు అనుకున్న మాట్లాడుకున్న మాటలను కూడా ఇదిగో ఈ విధంగా మీ ముందు ఉచింది. ఒక కలెక్టర్.. అందునా మహిళా కలెక్టర్ అంటే హోదా కంటే ముందు అమ్మతనం.. మంచితనం.. మానవత్వం..చేయూత నందించే సహాయం ఉంటాయనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన జిల్లా కలెక్టర్ విజయ్ క్రిష్ణన్ సేవలకు ఈరోజు-ఈఎన్ఎస్ కూడా ఒక ప్రత్యక్ష సాక్షి అయ్యింది. నిజంగా ఒక ఉన్నత భావాలు ఉన్న కలెక్టర్ అంటే నిజంగా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ లా ఉంటారేమో..ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మంచి మాటలను నిజంచేసే ఐఏఎస్ అధికారులు ఎక్కడుంటారు చెప్పండి..ఇలాంటి అధికారులు చేసే మంచి పనులను ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది..!




