(ఈఎన్ఎస్-విశాఖపట్నం, పశ్చిమగోదావరి, అమరావతి)
ప్రభుత్వ శాఖలోని ఉద్యోగం అంటే.. ఉద్యోగంలోకి చేరే ముందు కూడా స్థానిక పోలీసులతో విచారణ చేయిస్తారు. ఈయనపై ఏమైనా చీటింగ్ కేసులుగానీ.. క్రిమినల్ కేసులుగానీ ఉన్నాయా అనితెలుసుకోవడానికి.. అలాంటిది పశుసంవర్ధకశాఖలోని నికిలీలు ఉన్నారనే విషయాన్ని అత్యంత గోప్యంగా విచారణ చేసే సిఐడీకి అప్పజెప్పకుండా తమ శాఖ అధికారులే విచారణ చేస్తారనడానికి కారణం ఏమిటో అధికారులే చెప్పాల్సి వుంది. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం ఎప్పుడైనా జీఓ జారీ చేస్తుంది. అలా జారీచేస్తే వాస్తవాలు బయట పడినపుడు దాని ఆధారంగా కోర్టులో కేసులు వేయడానికి ఆస్కారం వుంటుంది. కానీ ఇక్కడ చాలా తెలివిగా పశుసంవర్ధక శాఖలోని ఓ అధికారి జీఓ రాకుండా కేవలం మీడియాలో వచ్చిన కధనాలపై కేవలం ప్రభుత్వ శాఖ విచారణ చేయాలని మాత్రమే సర్క్యులర్ ఇచ్చారంటే దానిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలని ఇదేశాఖలోని అధికారులే విస్తుపోతున్నారు. అయినా తమశాఖలోని ఉద్యోగాలకు సమర్పించిన సర్టిఫికేట్లు నకిలీవో, నిజమైమనవో తమకు తెలియదని.. దానిని మేము దృవీకరించలేమని.. వాటిని విద్యాసంస్థలు, అక్కడి డేటాబేస్ లోని సమాచారం ఆధారంగా దృవీకరించాల్సి వస్తుందని చెబుతున్నా..సదరు అధికారి నకిలీలను సేవ్ చేయడానికే అంతా తాను చూసుకుంటానని..ఈ సర్క్యులర్ తీసుకు వచ్చారని చెబుతున్నారు.
-ప్రభుత్వం వద్దనే ఆధారాలన్నీ.. అయినా.. మళ్లీ సేకరిస్తున్నారు
పశుసంవర్ధకశాఖలోని సహాయకులుగా ఉద్యోగాలు పొందిన వారి డేటా అంతా రాష్ట్రంలోని 28 జిల్లాలు 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని జిల్లా కార్యాలయాల్లో వుంటుంది. ఎందుకంటే ఉద్యోగాల్లో చేరినపుడు వారి విద్యార్హతలతోపాటు, తమ సర్టిఫికేట్లు నకిలీవని తేలితే తీసుకునే చర్యలకు తాము కట్టుబడి ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి మరీ ఉద్యోగులు జాయిన్ అవుతారు. వాస్తవానికి ఎలాంటి సర్క్యులర్ లేకుండానే ఆ సమాచారం.. జిల్లాల నుంచి సేకరించి, లేదా హెచ్ఆర్ఎంఎస్ డేటా బేస్ నుంచి తీసుకొని కూడా సదరు అబ్యర్ధులు సమర్పించిన సర్టిఫికేట్లు అసలైనవో.. నకిలీవో తేల్చేందుకు నేరుగా సిఐడీ ద్వారా మూడో కంటికి తెలియకుండా విచారణకు పంపవచ్చు. కానీ ఇక్కడ పశుసంవర్ధకశాఖలోని అధికారులు అలా చేయలేదు. ఈ శాఖలో నకిలీలు ఉన్నారనే విషయాన్ని లోకాయుక్తాకి ఫిర్యాదు చేసిన తరువాత, దానిపై మీడియాలో కథనాలు వచ్చిన తరువాత, సమాచార హక్కు చట్టం దరఖాస్తులు వచ్చిన తరువాత అత్యంత వేగంగా ఆరునెలల తరువాత ప్రభుత్వం స్పందించింది. అదీ కూడా నకిలీలను కాపాడేందుకు ముందుగా ఒప్పందం చేసుకునే ప్రభుత్వ జీఓ కాకుండా సర్క్యులర్ ఇచ్చారి ఇదేశాఖలోని పశుసంవర్ధకశాఖ సహాయకులే ఆరోపిస్తున్నారు.
-విచారణలో వాస్తవాలు బయటకు రాకుండా ప్రత్యేక రొక్కం..?
పశుసంవర్ధక శాఖలోని నకిలీలు వ్యవహారం బయటకు రాకుండా.. అటు ప్రభుత్వంలో మాట పడకుండా.. ఫిర్యాదు దారు చేసిన ఫిర్యాదులు, లోకా యుక్తా ఫిర్యాదులు, సహచట్టం దరఖాస్తు దారులు శాంతించే విధంగా శాఖా పరమైన విచారణ వేశారని.. వాస్తవానికి ఈ విచారణ సిఐడీతో చేయించాలని ఉద్యోగలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ముందుగా నకిలీలకు సమాచారం ఇచ్చి.. వాళ్లు అంతా సర్ధుకున్న తరువాతనే ఈ విచారణ సర్క్యులర్ జారీచేశారని ఇక్కడ కూడా భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయని.. వీరిని కాపాడేందుకు రాష్ట్ర కార్యాలయంలో తెరవెనుక వున్న ఆ అధికారి బయటకు వస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు ఉద్యోగులు. అంతేకాకుండా జిల్లాల్లో పశుసంవర్ధశాఖ సహాయకుల ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చేశారని.. అలా విధుల్లోకి చేరిన తరువాత ఎవరూ ఏమీ చేయలేరనే సాంకేతిక కారణం చూపించడానికి.. ప్రభుత్వాన్ని కూడా బురిడీ కొట్టించడానికే నకిలీలపై విచారణకు జీఓ కాకుండా.. కేవలం సర్క్యులర్ మాత్రమే జారీ చేశారని నికార్శైన అభ్యర్ధులు, ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఈ విచారణకు జిఓ కాకుండా సర్క్యులర్ రావడానికి రూ.25 లక్షల వరకూ వసూలు చేశారని కూడా చెబుతున్నారు. ఇపుడు విచారణ కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే చేస్తున్నారు తప్పితే విచారణలో ఎక్కడా పోలీసు అనే పదమే లేకుండా జాగ్రత్త పడ్డారని దుయ్యబడుతున్నారు.
-అసలు విచారణ ఈ విధంగా సాగాలి.. కానీ ఎలా జరుగుతుందంటే..?
ప్రభుత్వశాఖలో ఎవరైనా ఉద్యోగంలోకి చేరినపుడు తనపై ఎలాంటి కేసులు లేవని, తాను సమర్పించిన సమాచారంలో ఎలాంటి తప్పులున్నా దానికి పూర్తి బాధ్యత వహిస్తానని ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా .. ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు, లోకా యుక్తా ఫిర్యాదు మేరకైనా విచారణ సిఐడీతో చేయించాలి. కానీ ఇక్కడ పశుసంవర్ధకశాఖ అధికారులు మాత్రమే సోమవారం విచారణ చేస్తున్నారు. 2) విచారణ చేయాల్సి వస్తే సదరు అభ్యర్ధి ఉద్యోగానికి అర్హత సర్టిఫికేట్లుగా సమర్పించిన వాటిని కేవలం సిఐడీ అధికారుల ఆధ్వర్యంలో సదరు విద్యాసంస్థల రికార్డుల ఆధారంగా విచారణ చేయించాలి. అక్కడ చదివినట్టుగా ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్, ప్రొవిజిల్, మార్క్స్ లిస్టు, ఓడీ ఇలా అన్నింటిపైనా విద్యాసంస్థల యొక్క ఆన్ లైన్, ఆఫ్ లైన్ డాటాలో విచారణ చేసిన తరువాత సదరు విద్యాసంస్థల నుంచి ఎన్ఓసీ తీసుకు వచ్చిన తరువాత మాత్రమే వాటిని ఒరిజినల్ సర్టిఫికేట్లుగా భావించాలి. 3)వాస్తవానికి అభ్యర్ధులు సమర్పించిన సర్టిఫికేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివి కాకపోతే..విధుల్లోకి చేరిన ఆరునెలల్లోనే వాటిని సదరు ప్రభుత్వశాఖ అధికారులు విచారణకు సాధరణంగానే విద్యాసంస్థలకు పంపి విచారణ చేయాలి కానీ ఇక్కడ అలా జరగలేదు
4)ఇపుడు కూడా విచారణ నోటిఫికేషన్ లో ఇచ్చిన ఉద్యోగం.. దానికి అర్హత సాధించిన సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా అని మాత్రమే చూసి పశుసంవర్ధక శాఖ అధికారులే స్వీయ విచారణ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకం 5) విచారణ కూడా ప్రభుత్వశాఖల ద్వారానే చేయించాల్సి వస్తే.. ప్రభుత్వశాఖలోని ఈశాఖకు అనుంబంధ శాఖలుగా ఉన్న అధికారులతో చేయించాలి(ఉదా హరణకు వ్యవసాయశాఖలోని అగ్రిల్యాబ్స్ కి విత్తనాల నాణ్యత పరిశీలించాలంటే.. ఏ జిల్లాకి చెందిన విత్తనాలను ఆ జిల్లాకు పంపరు. ఆ విత్తనాలపై బ్యాచ్ నెంబరు, కోడ్ వేసి మరో జిల్లాకి పంపుతారు. అక్కడ ల్యాబ్ లో వాటని పరీక్షించి ప్రభుత్వానికి లాబ్ రిపోర్ట్ ఇస్తారు.) కానీ ఆ విధంగా కూడా విచారణ జరగడం లేదు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే నకిలీలను కాపడటానికే పశుసంవర్ధకశాఖ అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారని అర్ధమవుతుంది. విచారణ 25లోగా ప్రారంభించాలని.. అదీ చాలా అర్జెంట్ గా చేయాలని ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా నకిలీలను నిగ్గు తేలుస్తారో.. లేదంటే..ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మమ అనిపించేసి అంతా బాగానే ఉందని తేల్చేస్తోరో..వెయిట్ అండ్ సీ..?!




