(విశాఖపట్నం-ఈరోజు ప్రధాన ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అత్యంత తేడా పరిపాలనకు గ్రామ, వార్డు సచివాలయశాఖ కేంద్ర బిందువుగా మారుతోంది. ఉద్యోగులకు న్యాయ బద్దంగా కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో రూల్స్ లేవని నొక్కి వక్కానిస్తూ.. ప్రత్యేక పరిశోధనల పేరిట కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల పీస్కేలు కుదించాలంటే మాత్రం టక్కుటన జీఓనెంబరు 60ని తెరమీదికు తెచ్చింది. ఏడాదిలో రెండు పదోన్నతులు వచ్చాయని మురిసిపోయిన పంచాయతీరాజ్ శాఖలోని గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు కూటమి ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ కొట్టింది. పదోన్నతులు ఇచ్చినట్టే ఇచ్చిన దారుణంగా సుమారు నాలుగువేల వరకూ పేస్కేలు కుదించేస్తూ.. రివర్స్ చేసి ప్రత్యేక జీఓ కూడా విడుదల చేసింది.

దీనిపై రాష్ట్రంలోని 28 జిల్లాల్లోని సుమారు 13 వేల 100 పంచాయతీల్లో సచివాలయాలు ఏర్పాటైన తరువాత నియామమైన సిబ్బందికి పేస్కేలు రివర్స్ అయిపోయింది. దీనితో సచివాలయ ఉద్యోగులంతా నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తుందనుకుంటే.. ఉన్న సమస్యలను జఠిలం చేసి.. పేస్కేలుని ఇంత దారుణంగా కుదిస్తుందని కలలో కూడా అనుకోలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమతో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ శాఖల పనులూ చేయించుకోవడమే కాకుండా తమకు ఇచ్చే పేస్కేలుని కూడా దారుణంగా కుదించేసిందని.. తక్షణమే ఈజీఓని వెనక్కి తీసుకోకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల పేరు ఉంచడం ఇష్టం లేని కూటమి సర్కారు దానిని స్వర్ణ వార్డు,స్వర్ణ గ్రామంగా మార్చింది. అంతకంటే ముందు రేషనలైజేషన్, క్లస్టర్ వ్యవస్థలను తీసుకొచ్చి సిబ్బందిని కుదించింది.. సిబ్బందికి సహాయంగా ఉన్న వాలంటీర్లను తొలగించేసింది. ఇపుడు తాజాగా పదోన్నతి పేరుతో పేస్కేలు రివర్స్ చేసేసింది. దీనితో ఉద్యోగులు తమ సర్వీసులో చాలా ప్రయోజనాలు కోల్పోతామని అంటున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం విధానం, ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం వలన సర్వీసు రెగ్యులరైజేషన్ తరువాత 2 నోషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోయామని.. 9నెలల పేస్కేలు కోల్పోయామని.. గతప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పీఆర్సీ కూడా కోల్పోయామని..ఇపుడు ఏకంగా పదోన్నతులు వచ్చిన తరువాత పెరగాల్సిన పేస్కేలు కాస్తా రివర్స్ అయి పేస్కేలు కూడా కోల్పోయామని..ఏడేళ్లు అవుతున్న తమ సహచర శఖల ఉద్యోగులకుకనీసం పదోన్నుతులు కూడా ప్రభుత్వం ఇవ్వలేదని.. ఉద్యోగ వ్యతిరేక విధానాలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి తామేంటో చూపించే సమయం ఆశన్నమైందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా సచివాలయాల్లోని సిబ్బందికి కూడా పదోన్నతులు అడిగితే ఇలానే పేస్కేలు రివర్స్ చేస్తామని భయాన్ని తమ పంచాయతీ కార్యదర్శిల ద్వారానే చూపించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ప్రభుత్వ పరిపాలనపై తాము న్యాయపోరాటానికి దిగుతామని సచివాయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ముందు స్థానిన సంస్థల ఎన్నికలు పెట్టుకొని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క సచివాలయశాఖ సిబ్బందినే కాకుండా యావత్ 75 ప్రభుత్వశాఖలను ఆలోచింపచేస్తున్నది. రానున్న రోజులు దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నదోననే ఉత్కంఠకు పెరుతుంది..!