(ఈరోజు-అల్లూరి పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి(అమరావతి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో టెన్షన్ తెచ్చిపెట్టింది. విధులకు ఆలస్యంగా వస్తే సిఎల్ నమోదు అవుతుందంటూ యాప్ లో హెచ్చరికల సందేశాలు పంపిస్తున్నది. దీనితో ఉద్యోగులు లబో దిబోమంటున్నారు. ప్రభుత్వ విధలమీద పనిగంటలతోపాటు.. అదనంగా పనిచేస్తున్నా.. అవేమీ పట్టించుకోని ప్రభుత్వం లేటుగా వస్తే మాత్రం సీఎల్ కట్ చేస్తామని చెప్పడంపై మండి పడున్నారు. అంతేకాకుండా ఇకపై ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తే.. తమ పని తాము కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ పనివేళలలు పూర్తయితే వెంటనే సెల్ స్విచ్చాఫ్ చేసి మళ్లీ మరుసటి రోజు ఉదయం పది గంటలకు వరకూ ఆన్ చేసేది లేదని.. ప్రభుత్వం హెచ్చరికలు ప్రభుత్వానికుంటే తమ వ్యక్తిగత జీవితం తమకూ ఉంటుందని తెగేసి చెబుతున్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులూ తాము పడుతున్నం అధిక సమయం పనిచేయరని.. కానీ తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఏమీ మాట్లాడని ప్రభుత్వం, అధికారులు తమ జీతాలు కుదించేయడానికి మాత్రం ఎన్ని దారులుంటే అన్ని దారులూ వెతుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అంటే ఉద్యోగులను సస్పెండ్ చేస్తుందని.. ఇలాంటి బెదిరింపులు ఎంతో కాలం సాగవని.. తమకు కూడా ఒక టైమ్ వస్తుందని..అపుడు తాము కొట్టే దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే గత ప్రభుత్వానికి అర్ధమైందని.. ఇపుడు ప్రస్తుత ప్రభుత్వానికి కూగా అర్ధం కావాల్సి ఉందని.. ఆరోజులు ఎంతో దూరంలో లేవని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం లేట్ అటెండెన్స్ లెక్క గట్టినపుడు సాయంత్రం 5 దాటిన తరువాత ఎలాంటి పనులూ అప్పగించకూడదని.. సర్వేలు, బిఎల్వో విధులూ అప్పగించకూడదని చెబుతున్నారు.
ఊపిరి సలపకుండా ఇంటికి వెళ్లిన తరువాత కూడా పనులు చేస్తున్న తమకు ఆలస్యంగా విధులకు వస్తే దానిని కూడా లెక్కగట్టి సిల్ కట్ చేస్తారా అంటూ మండి పడుతున్నారు. ఇకపై ప్రభుత్వం చేసే ప్రతీ చర్యనూ ప్రజల్లో తీసుకెళ్లేవిధంగా అదనంగా కష్టపడతామని కూడా చెబుతున్నారు. ఎంత ఓర్చుకున్నా.. ఏదో విధంగా తమను వేధించే చర్యలు అధికారులు దిగుతున్నారని ఈ విషయాన్ని తాము జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు లేట్ అటెండెన్స్ పై ప్రభుత్వం కళ్లు తిరిగే నిబంధనలు పెట్టడంపై ఒకేసారి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం ఏ విధమై చర్యలు తీసుకుంటుందనే విషయం వచ్చేనెల జీతాలు తీసుకునే సమయానికి గానీ తేలదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు సిఎల్ కట్ చేస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం మాత్రం ఖామని చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది..!




