(ఈరోజు-అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరిపాడేరు(అమరావతి)
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సుమారు 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయల్లో 1.20 లక్షలు పైగా ఉన్న సచివాలయ ఉద్యోగులు నేడు వచ్చే ఎన్నికలు రాజకీయపార్టీలకు ఓటు బ్యాంకు. అందులోనూ వీళ్లంగా సాధారణ ప్రజలకు అత్యంత చేరువగా వుంటున్నారు. గతవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అన్నీ రివర్స్ లో చేస్తూ వచ్చింది. వాటిని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ చర్చించి రాజకీయం కూడా చేసింది. అయితే ఆ వెంటనే సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వని పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ ఛానల్, సర్వీసు నిబంధనలు పెడుతుందని ఉద్యోగులంతా ఆనంద పడ్డారు. కాకపోతే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కంటే కూటమి ప్రభుత్వం ఇంకా అధిక తప్పులు చేస్తూ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో సాగ దీత దోరణి అవలంభిస్తూ వస్తున్నది.
తద్వారా పక్కాగా పడతాయనుకుంటున్న 1.20 లక్షల ఓట్లు.. వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఓట్లుకి ఇప్పటి నుంచే గండం ఏర్పడింది. వాస్తవానికి రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగికి కల్పించిన హక్కు ప్రకారం ప్రభుత్వం ఏ శాస్వత ఉద్యోగికైనా పదోన్నతి ఇచ్చి తీరాలి. లేదంటే వాళ్లు కోర్టుకి వెళ్లి సాధించుకుంటారు. అదేదో హామీ ఇచ్చినట్టుగా పదోన్నతులు ఏ మాతృశాఖల ద్వారా అయితే నియామకాలు చేపట్టారో అందులోనే ఉద్యోగులను వీలనం చేసి విధులు మాత్రం సచివాలయల్లో చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుండేది. ప్రకటనలు, హామీలు ఘనం.. ఆచరణ.. అమలు శూన్యం అన్నట్టుగా కూటమి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులను తీవ్ర నిరాసకు గురిచేస్తున్నది. ఫలితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ తప్పఇ ఇచ్చి తీరుతామని.. రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలు ఉంటే 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బలం, బలగం, ఓటు బ్యాంకు రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు ఉద్యోగులు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఇపుడు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఒక తరం ఉద్యోగులందరికీ వారి ఉద్యోగ విరమణ వయస్సు పూర్తయి పోయి వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఆ ఖాళీలు భర్తీచేయడానికైనా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి. కానీ అదేదో పరిశోధన అంటూ ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరీ ఉద్యోగులను ఉసూరు మనిస్తుండటం ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్రమైన నిరాశ పెరుకుపోతున్నది. రిటైర్ అయిపోతున్న ఖాళీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీచేయాలి. చాలా శాఖల్లో పదోన్నతులు కూడా ఇవ్వాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడా కనిపించడంలేదు. 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి శాఖల పనులు వారు చేసుకుంటే ఒక్క 75వ ప్రభుత్వ శాఖ ఉద్యోగులు మాత్రమే అన్నిశాఖల పనులూ చేస్తున్నారు. ఆ అదనపు భారాన్ని కూడా ప్రభుత్వం గుర్తించడ లేదు. ఆరు నెలల క్రితం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదని తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శిల పేస్కేలుకూడా రివర్స్ చేసి మరీ పెద్ద తప్పు చేసింది.
ఇవన్నీ మనసులో పెట్టుకుంటున్న ఉద్యోగులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తమ ఓటు పవర్ ఎలా వుంటుందో రుచి చూపిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు, సిబ్బంది రిటైర్ అయిపోతున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా కొన్ని క్యాడర్లు భర్తీ అవుతాయి.. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇచ్చినట్టు అవుతుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖకు తమ ప్రభుత్వంలో పదోన్నతులు ఇవ్వడం ఏంటని అనుకుంటుందో లేదంటే..రానున్న రోజుల్లో ఈ శాఖ లేకుండా చేయాలనుకుంటుందో తెలీదు గానీ.. ఉద్యోగులక మనస్సాంతి లేకుండా పదోన్నతులు ఇవ్వకుండా.. మరోప్రక్క ఉద్యోగులు విధినిర్వహణలోనే పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నది.. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వం ఆ లాజిక్ మిస్ అయి.. రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెబుతున్నారు.
మరో వైపు కొందరు సివిల్ సర్వీస్ అధికారులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది. దానికి ఇటీవల జారీ చేసిన కొన్ని జీఓలు, పంచాయతీ కార్యదర్శిల పేస్కేలు కుదించేయండం వంటి అంశాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖల కంటే అత్యధికంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు అన్నంత పనీ చేసేలా ఉన్నారని కూడా రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో పెద్ద చర్చకు తెరలేపడం కూడా ఇపుడు ప్రాధన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏం చేయబోతున్నదనేది ఆశక్తి కరంగా మారింది..!




