(ఈరోజు-విశాఖపట్నం ప్రధాన ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వేల సంఖ్యలో ఖాళీ అయిపోతున్న ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయశాఖ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం)ఉద్యోగులతో భర్తీచేయడానికి అన్ని పనులూ చక చకా చేసేస్తున్నది. దానికోసం 5374 మంది ఉద్యోగులు.. సచివాలయాల్లో అదనంగా ఉన్నారని.. వారిని ఆయా ప్రభుత్వశాఖల అభ్యర్ధన మేరకు ఆ ప్రభుత్వశాఖల్లోకి పంపుతున్నామంటూ.. మెమోజారీచేశారు ఆ శాఖ ప్రన్సిపిల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్. డిప్యూటేషన్లు చేస్తున్న వారిలో అత్యధికంగా మహిళా పోలీసులే 2948 మంది ఉండటం విశేషం. అయితే ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తామని చెప్పి రివర్స్ పేస్కేలు.. ప్రతిపాదిస్తూ మెమో జారీ చేసింది. ఆ ప్రక్రియ పూర్తిచేయకుండానే ఇపుడు ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లోకి డిప్యూటేషన్ పై పంపిస్తున్నది.

త్వరంలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటి వరకూ కాలం గడిపేస్తే..అపుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అపుడు మరికొన్ని నెలలు కాలయాప చేయొచ్చునని ప్రభుత్వం ఈ విధంగా తనకు నచ్చినట్టుగానే చేస్తున్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇతర ప్రభుత్వశాఖల్లోకి డిప్యూటేషన్లపై పంపే ప్రభుత్వం ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగుల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగని ఆ ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు న్యాయబద్దంగా రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఉలుకూ, పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనినిన గమనిస్తున్న తాము త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని బాహాటంగానే చెప్పుకొస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వంజారీ చేసిన మెమోతోపాటో ఏఏశాఖలకు ఉద్యోగులను డిప్యూటేషన్లు చేస్తుందో కూడా ఆ లిస్టులుకూడా మెమోతో జారీచేసింది ప్రభుత్వం. అత్యధికంగా 2948 మంది మహిళా పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 1078 మంది, వార్డు ఎమినిటీస్ సెక్రటరీస్ 558 మంది,
వార్డు ప్లానింగ్ సెక్రటరీలు 523 మంది, వీఆర్వోలు 266 మంది టోటల్ గా 5374 మందిని వివిధ ప్రభుత్వశాఖల్లోకి డిప్యూటేషన్ పద్దతిపై కేటాయిస్తూ స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ మెమో జారీ చేశారు.. ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవానికి వీలుగా మెమో మాత్రమే జారీ చేసింది. అంటే వీరిని ఎంత కాలమైనా అక్కడ ఉంచుతారు..లేదంటే ఎప్పుడైనా డిప్యూటేషన్ రద్దు చేసి వెనక్కి తీసుకు వస్తారు.. కానీ వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు.

ఎందుకంటే ఇతర 75 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు రిటైర్ అయిపోతుండటం, ప్రభుత్వశాఖలు ఖాళీ అయిపోవడం వలన కనీసం కార్యాలయ పనులు కూడా జరగలేని పరిస్తితులు రాబోతున్నాయి. వాటిని ముందుగానే ఊహించిన ప్రభుత్వం ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి.. సిబ్బంది అదనంగా ఉన్నట్టుగా చూపించి.. అలా ఉన్నావారిని ఆయా ప్రభుత్వశాఖల అధిపతుల నుంచి వచ్చిన వినతుల మేరకు సచివాలయ ఉద్యోగులను సర్దుబాటు చేస్తూ మెమో జారీచేసింది. కూటమి ప్రభుత్వంకూడా తమకు బాకీ ఉన్న రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు(సర్వీసు రెగ్యులరైజేషన్ సమయంలో), 9నెలల పేస్కేలు అరియర్స్, పీఆర్సీ బకాయిలు, ఆరేళ్లు దాటిన ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ఇవ్వాల్సిన మరో రెండు ఇంక్రిమెంట్లు విషయంలో నేటికీ ఎలాంటి ప్రకటన చేయకుండా.. ప్రభుత్వానికి అవసరం కనుక.. ఆగమేఘాలపై నిర్ణయం తీసుకొని మెమోలు జారీచేస్తుందని వాపోతున్నారు.

అదే సమయంలో ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క సచివాలయశాఖలోనే వందల సంఖ్యలో ఉద్యోగులు విధినిర్వహణలో మృత్యువాత పడుతున్నా కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇతర ప్రభుత్వశాఖల్లోకి డిప్యూటేషన్ కాకుండా పూర్తిగా మార్పు చేయాలని కోరుతున్నారు. లేదంటే అక్కడ కొన్నిరోజులు.. మాతృశాఖలో కొన్నిరోజు పనిచేయలేమని చెబుతున్నారు సచివాలయఉద్యోగులు. కాకపోతే ఇక్కడ కూటమిప్రభుత్వం అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందే తప్పా ఉద్యోగుల సంక్షేమ, వారి సమస్యలను ఎక్కడా పనిగణలోనికి తీసుకున్నట్టు ఏ ఉత్తర్వుల్లోగానీ, చర్యల్లోగానీ కనపించకపోవడం విశేషం. అంతేకాకుండా ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవీరికి ఎలాంటి పదోన్నతులు, పాత నోషనల్ ఇంక్రిమెంట్ బకాయిలు, రివర్స్ పేస్కేలు వీరిని మరింత క్రుంగ దీస్తున్నాయి..!