(విశాఖపట్నం-ఈరోజు ప్రధాన ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ(స్వర్ణవార్డు, స్వర్ణ పంచాయతీ) ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లోకి సర్ధుబాటు పేరుతో పంపడానికి రంగం సిద్దం చేసింది. అయితే ఇక్కడ సచివాలయాల్లో అదనపు సిబ్బందిని మాత్రమే సర్ధుబాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలా అయితే విధనిర్వహణలో మృతి చెందిన ఉద్యోగులు, ఇతర ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను ఎప్పుడు భర్తీచేశారు.. ఎక్కడ భర్తీ చేశారో మాత్రం చెప్పలేదు. సర్ ప్లస్ ఉద్యోగులంటూ ఒక పదాన్ని వాడేసి ఇపుడు ఉద్యోగులను ఇతర 74 ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు అయిపోతున్న వారి స్థానాల్లోకి పంపుతోంది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మాత్రమే సత్వర చర్యలు తీసుకున్నది తప్పితే ఉద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశ్యం మాత్రం ఇక్కడ లేదని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.
ప్రభుత్వానికి తమతో అవసరం అయితే రాత్రికి రాత్రే జీఓలిస్తున్నదని.. మా సమస్యలు పట్టించుకోండంటే అధ్యయనం పేరిట తీవ్ర కాలయాపన చేస్తూ.. ఇదంతా వైఎస్సార్సీపీ చేసిన తప్పుగానే చూపిస్తున్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా.. మాకు న్యాయం చేయొచ్చు కదా అంటే మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తుందని.. ఆ నివేదిక వచ్చిన తరువా చూద్దామని అంటోందని ఉద్యోగులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు భారీ ఎత్తున ఖాళీ అయిపోతున్నారని తెలిసే క్లస్టర్ వ్యవస్థతో సచివాలయాలను కుదించి సర్ ప్లస్ విధానానికి తెరతీశారని ఉద్యోగులు మండి పడుతున్నారు. ఇంకా చాలా సచివాలయాల్లో చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయని..వాటిని ఉన్న సిబ్బందితోనే అదనంగా పనిచేయిస్తున్నారని అన్నారు.
అలాంటపుడు అదనపు సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నిస్తున్నారు. తొలి విడతో సుమారు 17 వేల మంది సిబ్బందిని ముందు సర్ధుబాటు చేసి ఇంకా ఏ ఏ ప్రభుత్వశాఖల్లోకి సిబ్బంది అవసరమో పరిశీలిస్తామనడం ఎంత వరకూ సమంజసమని మండి పడుతున్నారు. తమకు ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల పేస్కేలు బకాయిలు, పీఆర్సీ ప్రయోజనాలు, ప్రమోషన్లు ఇస్తే తమని ఏ ప్రభుత్వశాఖలోకి పంపినా దర్జాగా పనిచేస్తామని చెబుతున్నారు. తమను ఇపుడు బలవంతంగా ఏ విధంగా అయితే సర్ధుబాటు పేరిట పంపుతున్నారో.. దానికి రానున్న ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలకు తెరలేపుతున్నారు.
-ఈరోజు-ఈఎన్ఎస్ న్యూస్ నెట్వర్క్ సంచలనం
ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇపుడు ఒకటే చర్చ ఇంత పెద్ద టీవి నెట్వర్క్, మరెంతో ఎక్కువగా ఉన్న ప్రతిక నెట్వర్క ఉన్న మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు వాస్తవం కావడం లేదని కేవలం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ రాస్తున్న కథనాలు ప్రభుత్వం కూడా అక్షర సత్యం చేసి చూపించడం ఇపుడు ఏపీ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నది. స్థాని పత్రికలో వచ్చిన వార్తలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా.. అమలు చేస్తుందా అని చాలా లూజుగా మాట్లాడిన సోకాల్డ్ మీడియాకి కూటమి ప్రభుత్వమే ఇపుడు సచివాలయ ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లోకి సిబ్బందిని సర్ధుబాటు పేరిట డెప్యూటేషన్లు వేస్తున్న వైనంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ రాసినా.. ఏ వీడియో చేసినా అది ప్రభుత్వంలో పక్కా అమలు కావడంతో ఇపుడు ఈఎన్ఎస్ మీడియా హౌస్ నెట్వర్క్ పై ఆరా తీయడం మొదలు పెట్టారు.
అంతేకాదు ఇలాంటి కీలక సమాచారం మీకు ఎలా వస్తున్నదంటూ కొందరు ఈరోజు ప్రతినిధికి ఫోన్లు చేసి మరీ అడగడం కూడా విశేషం. అయితే అన్యాయానికి గురవుతున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే ప్రతీ విషయాన్ని ప్రజల ముందు ప్రత్యేక కథనాలుగా పెడుతూ వచ్చింది. గత ఐదేళ్లుగా ప్రత్యేక అంశాలపై వీడియోలు చేస్తూ వస్తున్నది. కీలకమైన సమాచారం సుకరణలోనూ.. ప్రత్యేక వార్తలు ప్రచురించడంలో ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పుడూ ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగు పక్షానే ఉంటూ వస్తున్నది. ఇపుడు ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు కూటమి ప్రభుత్వంలో నిజం కావడంతో లూజు కామెంట్లు చేసిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది.




