(విశాఖపట్నం-ఈరోజు ప్రధానప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం మంత్రులు సచివాలయ శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదంటే ఇది కూడా 2029 సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యేక మేనిఫెస్టోగా గత ప్రభుత్వంలానే ఉంచేస్తారా..అసలు మా పరిస్థితి ఏంటని సచివాలయ ఉద్యోగులు తలలు పీక్కుంటున్నారు. మాతృశాఖల ద్వారా నియామకాలు చేపట్టిన ప్రభుత్వం.. ఆ మాతృశాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, నోషనల్ ఇంక్రిమెంట్లు..పీఆర్సీ ప్రయోజనాలు.. కల్పించడానికి అధ్యయనం ఏంటో తెలియడం లేదని.. అసలు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తరువాత జరిగిన సమావేశాల్లో తమ కోసం ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఒక ప్రక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ పంచాయతీ రాజ్ శాఖలోని కార్యదర్శిలకు అపుడే గ్రేడ్-3 వరకూ ఏడాదిలో రెండు పదోన్నతుల వరకూ వెళ్లిపోతే..అసలు ప్రభుత్వశాఖలేని ఉద్యోగులుగా మహిళా పోలీసులు మిగిలిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏడేళ్లపాటు.. ఒక నూతన ప్రభుత్వ శాఖ ఉద్యోగులను రెగ్యులర్ ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా గుర్తించడానికి రాష్ట్రప్రభుత్వమే కొర్రీలు వేస్తూ..ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు ఉద్యోగులతో త్రాగిండచం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. పాలనా యంత్రాంగంలో ఐఏఎస్ లది కీలక పాత్ర.. వారిఆధ్వర్యంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ 85 ప్రభుత్వశాఖగా మాత్రమే ఏర్పాటు అయ్యింది. కానీ దానికి ఎలాంటి తలా తోకా లేకపోవడంతో ఏడేళ్లు అవుతున్నా..నేటికి సుమారు 14 శాఖల్లోని 19 విభాగాల సిబ్బందికి నేటికి మాతృశాఖలు లేకుండా పోయాయి. ఇక్కడ ట్విస్టుఏంటంటే..ఉద్యోగులందరినీ ఆయా మాతృశాఖల ద్వారానే నియమించినా.. అదేశాఖలోని నిబంధనలు అమలు చేయడానికి దేశంలో ఎక్కడా లేని కొత్త కమిటీని, అధ్యయనం పేరుతో ఏకంగా 10 మంత్రులతో కూడిన సబ్ కమిటీ వేయడం విశేషం. ఇంతకీ ఇన్నిసార్లు సమావేశం అయినా ఉద్యోగుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడం విశేషం. అయితే ఒకటి అరా ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు వచ్చినా..ఒకేసారి ఉద్యోగాల్లోకి వచ్చిన వారిలో చాలా మంది పదోన్నతులు లేకుండా మిగిలిపోయారు. కోర్టు కేసులు కారణంగా మహిళా పోలీసులు ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా.. కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ.. పోలీసుశాఖ పనులన్నీ వారితో చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తేడా పరిపాలన చేస్తోంది. వైఎస్సార్సీ ప్రభుత్వం తలా తోకా లేకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలోనూ.. శాసన మండలిలోనూ పెద్ద చర్చకు తెరలేపి..తీరా సొంతశాఖలోని మహిళా పోలీసులను పోలీసుశాఖలో ఉంచుతారో.. వారిని అర్హతలను బట్టి ఏదైనా శాఖలోనికి మార్పుచేస్తారో కూడా చెప్పకుండానే కాలం గడిపేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. అదిగో ఇదిగో అంటూ అపుడే సుమారు రెండేళ్లు కాలం వెళ్లగక్కారని పాలనా పరంగా ఇక ఏడాది మాత్రమే సమయం ఉందని..మిగిలిన రెండేళ్లు కూటమిప్రభుత్వం రాజకీయ ఏర్పాట్లు చేసుకుంటే తమ పరిస్థితి వచ్చే ప్రభుత్వం వరకూ ఉండిపోవడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయ శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాఖ పేరుని మాత్రం రాత్రికి రాత్రే మార్చేసినా..వీరి ప్రయోజనాలు అడిగితే మాత్రం ఖజానాపై భారం పడుతుందని ఏవేవో లెక్కలుచెబుతున్నది. అయితే ముందుగా ప్రకటించినట్టు మార్చి నెలాఖరుతో కూటమి లోని సబ్ మినిస్టర్స్ కమిటీ కాలం పూర్తవుతుంది. నేటితో మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకోబోతుందో తేలిపోయి..ఉద్యోగుల భవిష్యత్ చిత్రం ఏ విధంగా ఉంటుందో తేలిపోతుంది..!