(ఈరోజు బాలు.. ఈరోజు-ప్రధాన ప్రతినిధి, అల్లూరి పాడేరు)
యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతాః.. ఎక్కడైతే అతివలు పూజింప బడతారో అక్కడే అభివృద్ధి అంతా వుంటుంది.. కీర్తి పరిఢవిల్లుతుంది. ఈ మాటలను అక్షర సత్యం చేసి చూపిస్తున్నారు అల్లూరి జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ. ఇద్దరూ యంగ్ అండ్ డైనమిక్ అధికారులే. ఏదైనా ఒక అంశంమీద దృష్టి పెడితే అది పూర్తయ్యేవరకూ వీరికి నిద్రపట్టదు. ఒక్కముక్కలో చెప్పాలంటే పరిపాలన కూడా వీరి చూస్తే పరిగులు పెట్టాల్సిందే. అధికారి అంటే ప్రజల సమస్యలను అర్జీరూపంలో స్వయంగా ఇస్తే తప్పా పరిష్కరించే రోజుల్లో లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. కానీ అల్లూరి జిల్లాలో ఆ పరిస్థితి అంతా రివర్స్.. ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి చేరడమే తరువాయి.. పరిష్కరించడంలో వీరి పాత్ర మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సస్(జనాభా గణన) జరుగుతోంది. కానీ రాష్ట్రంలో తొలిస్థానంలో అల్లూరి జిల్లాని నిలబెట్టారూ అంటే ఇక్కడ ముఖ్య అధికారిణిగా ఉన్న కలెక్టర్ కార్యదీక్ష ఏ స్థాయిలో ఉందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రభుత్వ ప్రాధాన్యత పనులను లక్ష్యానికి మించి పూర్తిచేయడంలో ఈ కలెక్టరమ్మది అందెవేసిన చేయి. ఇక జాయింట్ కలెక్టర్ విషయానికొస్తే.. ఈ సంయుక్త కలెక్టరమ్మకి ప్రజల సమస్యలు నేరుగా అర్జీ పెట్టకపోయినా.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసినా.. వాటిని క్షణాల్లో పరిష్కరించి ఆ విషయాన్ని మళ్లీ వారికే తెలియజేసే నేర్పు. ప్రస్తుతం అత్యంత వేగంగా పుంజుకుంటున్న టెక్నాలజీని కూడా పరిపాలనుకు జోడించి అల్లూరి జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్లడానికి ఈ అధికార అతివలు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు.. ఎక్కడైనా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా ఉన్న ఎవరి పని వారిదే అన్నట్టుగా వుంటుంది. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం దానికి భిన్నంగా సంయుక్తంగా జిల్లాను ముందుకి నడిపించడంలో వీరు చూపిస్తున్న శ్రద్ధ.. చేపడుతున్న కార్యక్రమాలు.. చేస్తున్న కార్యకలాపాలు నిజంగానే అందరినీ అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అయితే వీరి స్పీడుని ఇంకా మీడియా అందులోకపోతున్నది. నిజంగా మీడియా.. సమాచారశాఖ అందుకుని వీరు చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే దాని నుంచి వచ్చే ఫలితాలు మామూలుగా ఉండవు.
ఈ అధికారుల కోసం వీరు అల్లూరి జిల్లాలో అగుడుపెట్టినపుడే ఈరోజు దినపత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీరి కోసం ఏం తెలుసునని వచ్చిన రోజే పతాక శీర్షికన ప్రత్యేక కథనాలు రాసేశారని అంతా అన్నారు. తీరా వారిద్దరు వచ్చి..వారేంటో ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చూపిస్తున్నప్పుడు వస్తున్న ఫలితాల ఆ మాటలన్నవారందినీ ముక్కున వేలేసుకునేలా చేయడంతో పాటు ఔరా అనిపిస్తున్నాయి. ఇలాంటి ముందుచూపున్న అధికారులకు ప్రభుత్వం కూడా సహకరించి.. పుష్కలంగా నిధులిచ్చినా.. ఇతర 75 ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది తమవంతు సహకారం అందించినా అల్లూరి జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందనడంలో ఎలంటి సందేహం లేదు. అల్లూరి జిల్లాలో ఇన్నేళ్లలో జరగని అభివృద్ధి, పరిపాలన మార్పు వీరిద్దరూ వచ్చిన తరువాత పెద్ద ఎత్తున మారడం కూడా ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అందుకంటే అంటారు మహిళ ఆకాశంలో సగమని.. వీరు తలచుకుంటే జరగనిది ఏదీ ఉండదు.. ఉండబోదు.. ప్రజల మన్ననలు పొందిన కలెక్టరమ్మలు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజా సమస్యలు మరిన్ని పరిష్కరించాలని ఆశిద్దాం..!




