- ఆయువుపట్టు పంచాయతీలో పార్టీ క్యాడర్ అంతర్మధనంగొలుగొండ మండలంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాడు ఒకలా..నేడు మరోలా మారిపోయింది.. దానికి కొంతమంది నాయకుల తీరేనని స్పష్టం అవుతుంది. అది ఎవరో చెబితే నమ్మేపరిస్థితి ఇపుడు లేదు కదా.. ఆ విషయం కాస్తా ఆవిర్భావ దినోత్సవంలో బహిర్గతం అయ్యింది. అధికార ప్రభుత్వంలో పార్టీ కార్యక్రమాలకు క్యాడర్ అంటీ ముట్టనట్టు ఉన్నారంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో ఒక్కసారి అర్ధం చేసుకోవచ్చు..మనసులో ఎలా ఉన్నా పార్టీకోసం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసమైనా క్యాడర్ ప్రత్యర్ధి పార్టీని నమ్మించడానికైనా రావాలి.. ఆ పరిస్థితి కూడా లేకపోవడం క్యాడర్ చేజారి పోతున్నదనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.మండలంలోని నాగాపురం గ్రామంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పరిస్థితి క్రమంగా బలహీనపడుతున్నాయనే విషయం టిడిపి చేపడుతున్న కార్యక్రమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. తద్వారా రానున్న ఎన్నికల ముందు పార్టీ ఇంకెంత మంది ఉంటారో.. మరెంతమంది జంపు చేస్తారోనని పార్టీక్యాడరే బయటకు సంకేతాలిస్తున్నట్టుగా కార్యక్రమాలు ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. గిట్టని వారు పార్టీ కోసం ఏమైనా చెబుతారు.. దానిని నమ్మాలా అనుకోవచ్చు.. మాటలు చెప్పని చాలా విషయాలు కార్యక్రమం చేసినపుడు హాజరైన క్యాడర్..దిగిన గ్రూపు ఫోటోలే తేటతెల్లం చేస్తాయి. కొంతమంది స్థానిక నాయకుల వ్యవహార శైలిపై అసంతృప్తితో పార్టీ కేడర్ దూరమవుతోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్న వేళ గ్రామంలో పార్టీ పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతీది రాజకీయం చేయాలని చూడటం వలన గ్రామంలో ఒకప్పుడు గట్టి పట్టువున్న ఈ పంచాయతీ ఇపుడు దాని స్వరూపం మార్చుకుంటూ వస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ గ్రామంలో టీడీపీ గట్టి పట్టు సాధించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిందని చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో క్రమంగా కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో స్పష్టంగా బయటపడింది. కార్యక్రమానికి పట్టుమని పది మంది కూడా హాజరుకాకపోవడంతో నాయకత్వం దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి టీడీపీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ కష్టకాలంలో పనిచేసిన పాత కేడర్‌ను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే కొనసాగితే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని గ్రామంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీకి క్యాడర్ దూరం కావడం లేదు.. ఫోటోలో జనాలు లేకపోతే అంతా అయిపోయినట్టేనా అనే నాయకులు.. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో గౌరం పెంచుకోవడానికైనా రావాలికదా అన్న మాటకు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అని క్యాడరే సన్నాయి నొక్కుళ్లు నొక్కుతోంది.. మరి నాడు అలా.. నేడు ఇలా.. నాగాపురంలో టిడిపీ డీలా అనడానికి ఇంతకంటే సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటాయంటారా..?!
నాడు అలా.. నేడు ఇలా..నాగాపురం లో టిడిపీ డీలా..?!
Mandal News Card




