(ఈరోజు-అల్లూరి పాడేరు, చింతపల్లి, అరకువేలి)
సుండ్రు పుట్టు కి చెందిన ఒక సాధారణ పౌరుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా జిల్లా జాయింట్ జాయింట్ కలెక్టర్ కి చేరేలా ఓ వీడియో పెట్టాడు. ఎంపీడీఓ కార్యాలయం వెనుక రోడ్డుపై ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిసరాలలో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని, ఆసుపత్రిలో వినియోగించిన డయాలసిస్ నీరు, రక్త నమూనాలు శుభ్రం చేసిన నీరు,మురుగునీరు వీధులపై ప్రవహిస్తున్నాయని, ప్రజలు ఆ నీటిని దాటుకుంటూ వెళ్తున్నారని,ప్రజలు కాలుష్యం కారణంగా ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్ల వంటి జంతువులు చుట్టు ప్రక్కల చనిపోతున్నాయనీ, దుర్వాసన, దోమలు, నాచు ఏర్పడటం వంటి సమస్యలతో పాటు, త్వరలోనే చుట్టుపక్కల ప్రజలు హానికరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనీ ,మీ స్పందన ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ డిజిటల్ సందేశం, తీసిన ఫోటోలు పంపగా సత్వరం స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధి లోనే సమస్యను పరిష్కరించారు.

చూశారా.. ప్రజలకు సేవ చేయాలనే తపన.. అందునా పనిచేసే జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకూదనే తనపన.. ఏళ్ల తరబడి ఉన్న సమస్య పరిష్కారానికి బాటలు వేశాయి. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం స్పందించిన తీరు చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఈ విషయాన్ని కేవలం ఇద్దిరికే చెప్పి( ఒకటి అడిగిన వారికి.. రెండూ అడగని వారికి) తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆనందంతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్పందించే అధికారులుంటే విన్నపం ఏ రూపంలో వెళ్లినా పరిష్కారం అవుతుందని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీ పూజ అని చెప్పక తప్పదు..!