(అన్నవరం-ఈరోజు, ఏప్రిల్ 2)కాకినాడ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సామి దర్శనానికి వచ్చిన కలెక్టర్ కు ఈఓ వేండ్ర త్రినాధరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వామిని అంతరాయలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద అర్చకులు కలెక్టర్ కు వేద ఆశీర్వచనాలు చేయగా.. ఈఓ స్వామివారి ఫోటో, శ్రీవారి శేష వస్త్రం, ప్రసాదాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కాకినాడ జిల్లా కలెక్టర్ గా బాధ్యలతు చేపట్టిన అనంతరం శ్రీ సత్యదేవుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు శుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆశయం మేరకు ప్రజలు సేవలు అందించడమే తన ముందున్న కర్తవ్యమని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.