(ఈరోజు-అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
వర్కింగ్ జర్నలిస్టుల మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేసినట్టేనని స్థానిక ప్రతికల సంఘం ప్రతినిధి, ఈరోజు-ఈఎన్ఎస్ ప్రధాన సంపాదకులు పి.బాలభాను(ఈరోజు బాలు) పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, చేస్తున్న హత్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వికోట ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య, సాలూరులో సాక్షి, సీవీఆర్ టీవి జర్నలిస్టులపై జరిగిన దాడులను మీడియా ప్రతినిధులుగా తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. భారత రాజ్యంగం కల్పించిన భావ ప్రకటన హక్కు, ఆర్టికల్ 10, 19(1)ఏ ప్రకారమే మీడియాలో జర్నలిస్టులు వార్తలు రాస్తారని.. అంటే మీడియా కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందన్నారు. అలాంటి సందర్భంలో జర్నలిస్టులను వాస్తవాలు బయటపెట్టి నందుకు ఇంత దారుణంగా నరికిచంపడం దేనికి సంకేతమో ప్రభుత్వమే చెప్పాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతో పనిచేసే జర్నలిస్టులపై పాశవికంగా దాడులు చేస్తుంటే రానున్న రోజుల్లో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. దోషులకు శిక్ష పడాలన్నా.. జర్నలిస్టులపై దాడులకు తెగడబడలాన్నా దుండగలు భయపడే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా నింధితులను కఠినంగా శిక్షించడంతోపాటు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాల్లోనూ అటాక్స్ కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు చేయాల్సిన సమయం ఆశన్నమైందన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులపై జరిగిన దాడులు, చేసిన హత్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే.. తప్పులు చేసి తప్పైపోయిందని ఒప్పుకొని నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని..లేదంటే రానున్న రోజుల్లో వార్తలు జర్నలిస్టులతో కాకుండా ఏఐ టెక్నాలజీ వినియోగించి మీడియా సంస్థలు రాయించుకునే పరిస్థితి దాపురిస్తుంది ఈరోజు బాలు ఆ ప్రకటనలో హెచ్చరించారు.