(ఈరోజు-అల్లూరి పాడేరు(కొయ్యూరు, బూదరాళ్ల)
అల్లూరి సీతారామరాజు జిల్లా.. కొయ్యూరు మండలం..బూదరాళ్ళ పంచాయతీ.. ఈ గ్రామానికి అధికారులు ఏదో అమావాశ్యకి, పౌర్ణమి మాత్రమే వెళుతుతుంటారు.. మిగిలిన రోజులన్నీ వెళ్లినట్టుగా అన్నీ రికార్డుల్లో కనిపిస్తాయి. ఇపుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులూ చేయకుండానే రూ.80 లక్షలు ఖర్చుచేసినట్టు పంచాయతీ సిబ్బంది జిల్లా అధికారులకు చూపించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మాట్లాడితే మావోయిస్టుల బూచీ చూపించి మరీ అడ్డగోలుగా ప్రభుత్వ, ప్రజా దనాన్ని కొళ్ల గొడుతున్నారు. ఈ తేడా వ్యవహారంలో కొందరు సమాచార ప్రతినిధులకు కూడా నెలవారీ మామూళ్లు ఇస్తుండటంతో ఈ విషయం ఎక్కడా బయటకి పొక్కలేదు. కానీ జరిగిన పనులు.. బొక్కేసిన మొత్తం వ్యవహారం మాత్రం వాటాల్లో తేడాలు వచ్చిన వారే మీడియాకి లీకులిచ్చారు. ఎక్కువ మందికి చెప్పినా ఉపయోగం లేదని.. కేవలం ఇద్దరి మాత్రమే(ఒకటి అడిగిన వాడికి.. రెండూ అడగని వాడికి) చెబుతూ వచ్చారు.
ఈ గ్రామంలో రెండు చోట్ల రచ్చబండలు, ఒక చోట సీసీ రోడ్డు మాత్రమే నిర్మించారు. ఇంకేమీ నిర్మంచలేదు. అదీ కూడా ఎంత నాణ్యత నిర్మించారో ఒక్కసారి చూస్తే ఇక్కడి ఇంజనీరింగ్ అధికారులు మామూళ్ల వ్యవహారం ఏ పాటిదో ఇట్టే అర్ధమైపోతుంది. కేవలం రెండు పనులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.80 లక్షలు ఎలా ఖర్చు అయ్యాయో.. ఇక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి. సర్పంచ్, వాటికి బిల్లులు మంజూరు చేసిన జిల్లా పంచాయతీ అధికారులు చెప్పాల్సి ఉంది. ఈ పనులకు కూడా కమిటీ తీర్మానం గానీ, పంచాయతీ వార్డు మెంబర్లుతో కలిసి చేసిన పనులు ఎక్కడ లేవని పంచాయతీ ప్రజలు నేరుగా మీడియా ముందే చెప్పుకొచ్చారు. కాకపోతే పంచాయతీ రికార్డులు ఎం బుక్ లో రూ.80 లక్షల మొత్తానికి విత్ డ్రా చేసినట్టు చూపించారు. ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు చేసి.. వాటిని ప్రారంభించడానికి కనీసం జిల్లా కలెక్టర్ ని కూడా పిలవలేదు ఇక్కడి అధికారులు.. నాయకులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బూదరాల పంచాయతీకి 15 ఫైనాన్స్ నిధులు కోటి రూపాయల రాగా వాటిలో 80 లక్షల రూపాయలు శానిటైజర్ , వీధిలైట్లు, రచ్చబండలు, సిసి రోడ్లు, వాటర్ రిపేర్ లు జంగిల్ క్లియరెన్స్ మొదలగు పనులు చేసినట్లు ఎం బుక్ లో రాసేశారు. వాటిని ఎక్కడ చేయించారో తెలియంటే బిల్లులు ఒకే చేసిన అధికారులు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు స్వయంగా పరిశీలన చేస్తే తప్పా పంచాయతీ లో జరిగిన అభివృద్ధి ఆధారాలతో సహా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాగితాల్లో ఖర్చులు చూపించి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సూపర్ సర్పంచ్ అధికారులతో కలిసి కుమ్మక్కై భారీ దోపిడికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు అల్లూరి జిల్లా డీపీఓను, ఎంపీడీఓను సంప్రదించగా వారు అందుబాటులో లేరు. ఇంత పెద్ద భారీ అభివృద్ధి మాటున నిధుల బొక్కేసిన విధానంపై జిల్లా కలెక్టర్ నిషాంతి పూర్తి విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. లేదంటే చేయని పనులకు చేసినట్టుగా అల్లూరి జిల్లాలో ప్రతీ మారుమూల పంచాయతీలో ఈ విధంగానే అభివృద్ది అంతా కాగితాలపై రాసి.. ఆ మొత్తం వారి జేబుల్లో వేసుకొని.. అధికారులు ఇవ్వాల్సిన పర్శంటేజీలు చక్కగా ఇచ్చేస్తారు.




