(అల్లూరి సీతారామరాజు-ఈరోజు ప్రధాన ప్రతినిధి)
నిశ్వార్ధ సేవకు నిలువటద్దం అని వచ్చిన రోజే ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఐఏఎస్ అంటే హోదా కాదు ఒక గురుత బాధ్యతగా భావించే మనస్తత్వం.. ప్రజల సమస్యలంటే వారి కోణంలోనే ఆలోచించే గుణం.. ప్రజల మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యం.. ప్రజాప్రతినిధులకు కలసి మెలసి నడిచే గుణం.. ప్రభుత్వం సంక్షేమం చివరి కటుంబం వరకూ చేర్జే ఓర్పు.. జిల్లా యంత్రాన్ని ఒక ప్రత్యేక కటుంబంగా.. ప్రజల కోసమే పనిచేసే బాధ్యతను కూడగట్టే ఓర్పు.. ఎక్కడ పనిచేసినా సమస్యలు లేని ప్రాంతంగా ప్రజలను చూడాలన్నదే ఆమె లక్ష్యంగా పనిచేస్తూ ముందుకి సాగే తత్వం..అన్నీ వెరసీ జిల్లా కలెక్టర్ నిశాంతి అవుతారంటే అతిశయోక్తి కాదేమో..!
అల్లూరిసీతారామరాజు జిల్లా గిరిజనులు ఒక మంచి బిడ్డను వరంగా పొందినట్టే..ఎక్కడైనా పిల్లలను తల్లిదండ్రులు వరంగా పొందుతారు.. కానీ నిశాంతి ఐఏఎస్ ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంత ప్రజలు ఒక ఆడ బిడ్డను వరంగా పొందుతారు. ఒక్కమాట చెప్పాలంటే ఆమె మా బిడ్డ.. ఆమె లేకపోతే మా మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు అనే భావన ఆమె పనిచేసిన ప్రతీచోటా కలుగుతుంది. అంతా ప్రజాసేవలు మునిగిపోతారామె. గతంలో పనిచేసిన డా.బీఆర్.అంబేద్కర్ కోనసమలో ఇదే పరిస్థితి.. ఆ పరిస్థి ఇపుడు అల్లూరి జిల్లా వంతుగా వచ్చింది. ఆమె దగ్గర పనిచేయాలంటే జిల్లా అధికారులు కూడా ఎంతో ఆనంద పడతారు. ఎందుకంటే నిత్యం ప్రజాసేవలో తరించే ఆమె గుణం.. పట్టుకున్న సమస్యలను పరిష్కారం అయ్యేవరకూ వదలని ఉడుం పట్టు ఆమె నైజం. తానొప్పక.. ఎదుటివారిని ఒప్పించక అన్నట్టుగా ఎవరికీ ఎలాంటి కష్టం రాకుండానే అన్ని వర్గాల ప్రజలకూ చేరువ అవుతారామె. ఐఏఎస్ అధికారి అంటే హోదానే కాదు ప్రభుత్వం కల్పించిన విశేష అధికారాలతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తే.. ఆ పేరు ప్రభుత్వానికి చేరుతుందనే కోణంలోనే పనిచేస్తారు.
ప్రతీ ప్రభుత్వ పథకం అర్హులైన వారందరికీ అందాల్సిందే.. అర్హత లేనివారికి ప్రభుత్వ పథకం అందితే ఆమెలోని విశ్వరూపాన్ని మరో కోణంలో కూడా అధికారులు చూడాల్సి వస్తుంది. అవినీతికి ఆమె ఆమడ దూరం.. దాని వాసన కూడా ఇరు పంచాలకి కూడా రానీయరు. ఆమె పనిచేసే జిల్లాలో అన్ని గ్రామాలను స్వయంగా పరిశీలిస్తారు. అన్నిప్రాంతాల అభివృద్ధి ఒకేలా చేయాలనుకుంటారు. అంతేకాదు క్రీడలు, యువతకు ఉపాది, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, కళాశాలల్లో వసతుల కల్పన, ఖాళీల భర్తీలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.
-వసతి గృహాలను గాడిన పెడితే గిరిపుత్రుల వరమే
రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో ఇపుడు ఆమె ముందున్న ప్రధాన సమస్య ఐటీడీఏ వసతి గృహాలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు గిరిపుత్రుల పౌష్టికాహారం, మౌళిక వసతులు, విద్యా, వైద్యం కోసం అందిస్తున్నా..నాటి నుంచి నేటి వరకూ అల్లూరి జిల్లాలో మాత్రం అవి గిరిపుత్రుల వరకూ చేరడం లేదు. ఈ ప్రాంతానికి ఏ అధికారి వచ్చినా కొత్తలో కాస్త హడావిడీ చేసి తరువాత సంక్షేమ వసతి గృహాలు, ఏకలవ్య పాఠశాలలు, ఆశ్రమాలను గాలికి వదిలేస్తుంటారు. దానితో వాటిని నిర్వహించేవారి ఇష్టారాజ్యం. అన్నీ ఖర్చులు కాగితాలపై చూపిస్తారు.. అసలు మొత్తం పీకలదాకా మెక్కేస్తారు. అలాంటి తరుణంలో అల్లూరి జిల్లాకు వచ్చిన నిశాంతి ముందున్న లక్ష్యాన్ని చేధించి గిరిపుత్రులకు నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టిక ఆహారం, వైద్యం, మౌళిక సదుపాయాలు కల్పించే ప్రధాన బాధ్యత కూడా ఆమె తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా చాలీచాలనీ వైద్య సిబ్బందితో ఏజెన్సీలోని చాలా ప్రాంతాలకు వైద్య సేవలు మృగ్యం అవుతున్నాయి. వాటిని అధిగ మించాలంటే సిబ్బంది నియామకం.. ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయాల్సి వుంది.




