( అన్నవరం- ఈరోజు, మార్చి 27) అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో క్షేత్రపాలకులుగా వీరజిల్లుతున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం సీతారాముల వారికి పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించి వెండి పల్లకిలో ఆసిన్లు గావించి నూతన వధువు వరులైన సీతారాముల వారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి పలికిలు ఆసిన్లు గావించి నూతన వధూవరులైన సీతారాములవారిని వెండి ఆంజనేయ స్వామి వాహనంపై ఆ సీన్లు గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు రామాలయం పక్కన ఉన్న వార్షిక కళ్యాణ వేదిక వివిధ రకాల సుగంధ భరితమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి సింహాసనంపై నూతన వధూవరులైన సీతారాముల వారిని ప్రతిష్టించి మరోపక్క పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్న సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవారిని ఆసీన్లు గావించి పెళ్లి తంతు ప్రారంభించారు.
అనంతరం దేవస్థానం తరపున దేవస్థానం చైర్మన్ హైవీ రోహిత్, ఈవో వేండ్ర త్రినాధరావు దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు,అర్చకులు, పురోహితులు విగ్నేశ్వర పూజ పుణ్యవాహవచనం, గౌరీ పూజ,యజ్ఞ ప్రత్యేక పూజలు నిర్వహించి నీరాజనం మంత్రపుష్పములు సమర్పించి శుభముహూర్తాన మంగళ ధారణ గావించారు.అనంతరం సీతారాముల కళ్యాణం వీక్షించిన భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు, గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగు చర్యలు చేపట్టారు సీతారాముల కల్యాణ మహోత్సవంలో వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు కోటసుబ్బయ్య అర్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, కోట వంశీ కళ్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు పాలెంకి పట్టాభిరామమూర్తి దేవస్థానం అధికారులు సిబ్బంది మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




