(ఈరోజు ప్రధాన ప్రతినిధి-నర్సీపట్నం)
మీకు తెలుసు కధా సృష్టికి మూల పురుషుడే పరమశివుడు అలాంటి శివుని పేరుతో జరిగే కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేస్తుంటే.. ఆ శివుడికి మాత్రం కోపం రాదా చెప్పండి. ఆ కారణంగానే.. కోపోద్రిక్తుడైన ఆ ముక్కంటి కైలాసంలో కోపంతో శివతాండవం చేస్తున్నాడట. దానిని నిత్యం పరిశీలిస్తున్న ఆ పార్వతమ్మ..శివుని ఉగ్రతాండవాన్ని తట్టుకోలేకపోతున్న ఆ గంగమ్మ తల్లీ శివుడితో మాట్లాడుతూ.. ఇలా అన్నారట.. ఓ పరమశివా.. నీ విగ్రహాన్ని నిర్మించ తలపెట్టి.. దానికి లోకం సృష్టికర్తవైన నీకోసం ఆ క్షేత్రానికి సృష్టి క్షేత్రం అని పేరు పెట్టడం కూడా బాగుంది. కానీ ప్రజలను వెర్రివాళ్లను చేయడానికి.. మరీ పిచ్చివాళ్లను చేయడానికి మరీ దారుణంగా భూలోకంలో రాజకీయపార్టీలు, అందులోని నాయకులు ఇంతలా మారిపోయారేంటి స్వామీ.. అంతేకాకుండా పోటీ పడీ మరీ నీకు పూజలు చేస్తున్నారు.. కొట్టేదేమో ఒక్క కొబ్బరి కాయ.. ఫోటోలకి ఫోజులిచ్చి దిగేదేమో వందల మంది.. దానిని మీడియాలో రాస్తున్న విలేఖరులేమో పదుల సంఖ్యలో ఉన్నారు. భూలోకంలో రాజకీయం అంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందని.. మీ కోసం నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన సృష్టి క్షేత్ర నిర్మాణ విషయంలోనే చూడాల్సి రావడం కడు శోచనీయం స్వామి అని మొరపెట్టుకున్నారట.

వీళ్లు నిజంగా మీ కటాక్షం కోసం పూజలు చేయడం లేదు.. పక్కా రాజకీయ ఉద్దేశ్యంతోనే చేస్తున్నారు.. అని పరమ శివునితో చెప్పారట. స్వామీ బూలోకంలో మానవులు రాజకీయం కోసం ఏమైనా చేస్తారనుకున్నాం గానీ.. దేవుళ్లును.. మీకు చేసే పూజలను తెగ పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారని ఒకింత కోపంతోనే చెప్పారట. అంతేకాదు.. సృష్టి క్షేత్రం అన్న పదం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయం.. చెరువులో 120 అడుగుల నిర్మాణం.. దానిపై కోర్టు కేసులు.. మళీ దానిపైనే రైతుల పంట భూముల ఆయకట్ట అంటూ చేస్తున్న రాజకీయంతో శివుడు కూడా విసుగు చెంది.. కోపంతో అనునిత్యం కైలాసంలో శివ తాండవం చేస్తూ.. ఊగిపోతున్నారట. ఇదేదో లోక కంఠకంలా ఉందని ఆ పార్వతీదేవీ, గంగమ్మ తల్లు ఎంత ప్రయత్నించినా శివుని కోపాన్ని ఆపలేకపోతున్నారట. స్వామీ మీరు శాంతించండి ఎంత చెబుతున్నా.. భూలోకంలో ఒకప్పుడు ఎవరికైనా ఆపద వస్తే.. నాకు పూజలు చేసేవారు.. కానీ ఇపుడు వాళ్లకి వాళ్లు రాజకీయం చేసుకోవడానికి నన్ను మీడియాలో వార్తలుగానూ.. సోషల్ మీడియాలో పబ్లిసిటీగానూ ఒక్క కొబ్బరి కాయమాత్రమే కొట్టి మరీ వాడేస్తుంటడటం నాకు కూడా అపరిమిత కోపాన్ని తెప్పిస్తున్నది..

కనీసం నాకు పూజలు చేసేవారు ఎంత మందైతే వస్తున్నారో.. అంతమందీ అన్ని కొబ్బరి కాయలు కొడితే.. అలా కొన్నందుకు ఆ కొబ్బరికాయలు అమ్మేవాడికైనా ఈ సృష్టిక్షేత్రం ఎపిసోడ్ నడిచేవరకూ ఉపాది దొరికేది.. అరటి పళ్లు అమ్మేవాడికి మూడు పూటలా అన్నం దొరికేది.. ఆ పూలు అమ్మేవారికి కనీసం అప్పులైనా తీరేవి.. కుంకమ, అగరొత్తులు అమ్మేవారికి ఏదో నాలుగు డబ్బులు వచ్చేవి.. ఆలయంలో నాపేరుతో పూజలు చేసే అర్చకులకు తాంబూలమైనా దక్కేది అని శివుడు కూడా మదనపడి గంగమ్మ, పార్వతమ్మలతో చెబుతున్నారట. కానీ అలా జరగడం లేదు.. వాళ్ల నాయకుడు ఆదేశించాడంని..పనిగట్టుకొని నా ఆలయాలకు వచ్చి.. కొట్టే ఒక్క కొబ్బరికాయకు 20-30 మంది ఫోటో దిగడం.. ఆ ఫోటోలో నా విగ్రహాన్ని కూడా కనపడనీయకుండా మూసేసి వాళ్లే దిగిపోవడం.. మీడియాకిచ్చే ప్రెస్ నోటులో కూడా శివుని గుడిలో పూజలు.. వారి మనసు మార్చాలని ఒక్క లైను మాత్రమే రాసి.. మిగిలింది మొత్తం రాజకీయం చేసేవారి పేర్లే రాసుకోవడం కూడా నచ్చడం లేదు. జీవకోటి సృష్ఠికి కారణమైన నాతోనే ఇన్ని రాజకీయాలు చేస్తున్నందుకు.. పోటీ పడీ ఈ రెండు పార్టీల నాయకులు ఎంత కాలం మీడియాకి ఫోటోలు, ప్రెస్ నోట్లు ఇవ్వడానికి పూజలు చేస్తారో చూద్దాం.. అలా చేయమని వారి మనసుల్లోకి దూరి చెప్పింది నేనే..ఎందుకంటే నా ఆదేశం లేనిదే ఎవరూ ఏపీ చేయలేరు.. అన్నారట..

అంతేకాదు.. ఈ రాజకీయనాయకులంతా పూజచేసిన ప్రతీసారి.. ఎన్ని కొబ్బరి కాయలతో నా గుడికి వస్తారో చూద్దాం.. నిజంగా సృష్టిక్షేత్రం నిర్మించే సమయంలో నా విగ్రహం కోసం ఎంత విరాళాలు ఇస్తారో చూడటానికే.. అటు ఆ పార్టీకి.. ఇటు పార్టీకీ కళ్లు తెరుచుకునేంత వరకూ తానేమీ చెప్పనని.. ఎంత కాలం రాజకీయం చేస్తారో నేనూ చూస్తానని.. అంతవరకూ నా కోపం చల్లారదని.. కోపం తగ్గేవరకూ ఇలా ఉగ్రరూపంతో శివతాండం చేస్తూనే ఉంటానని పరమశివుడు అమ్మవార్లకు బదులిచ్చారట. ఇపుడు సోషల్ మీడియా కాలమేమో.. కైలాసంలో కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంది కాబోలు ఆ సమాచారం మళ్లీ ఈరోజు మీడియా కార్యాలయానికి ఈ విధంగా కైలాసం నుంచి ఆ పరమనశివుడి కోపం పేరుతో ఓ ప్రెస్ నోటు వచ్చింది.. ఇక్కడ వైఎస్సార్సీపీ.. టీడీపీ పార్టీలు ఒక్కటి ఆలోచించాలి. తాము ఏం చేస్తున్నామో.. ప్రజలను మీడియాలో వచ్చేవార్తలో.. నిత్యం చేసే ఒక్క కొబ్బరి కాయపూజల ఫోటోలతో ఏం మెసేజులు ఇస్తున్నామనేది. ఇక్కడ ఏ ఒక్కపార్టీని తప్పు పట్టడం మీడియా ఉద్దేశ్యం కాదు మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసి.. ప్రజలు మన్ననలు పొందగలిగిన వాళ్లే నిజమైన రాజకీయకీయనాయకులుగా నిలిచిపోతారు. అపుడు ఆ జీవకోటి సృష్టికర్త పరమశివుడు కూడా మెచ్చుకోవడానికి ఆస్కారం వుంటుంది.. ఇరు పార్టీల నేతలు మనసు మార్చి నిజంగా నిర్మించాలనుకుంటే అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతంలో సృష్టి క్షేత్రం నిర్మాణం జరిగి.. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఉన్న ప్రాంతంగా నర్సీపట్నం కీర్తి కెక్కెతుంది..శివోహం..!