(ఈరోజు-అల్లూరి సీతారామరాజు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-ఆఫీస్ లక్ష్యాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వశాఖలు, మండల అధికారులు చేరుకోవడంలో సాంకేతిక కారణాలు అడ్డు తగులుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కార్యాలయాల్లో సైతం ఈ-ఆఫీస్ విధానంలో పనిచేయడం రాకపోవడం, స్పీడ్ ఇంటర్ నెట్ లేకపోవడం, పూర్తిగా ఐటీ అవాగాహన లేకపోవడం వంటి సమస్యలు ఇపుడు జిల్లాను వెంటాడుతున్నాయి. జిల్లా కలెక్టర్ గా వచ్చిన నిషాంతి అన్ని పనులూ ఈ-ఆఫీస్ ద్వారానే జరగాలని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సు పెట్టి ఆదేశించినా.. దానిని అమలుకి ప్రభుత్వశాఖల అధికారులు.. అందునా మండల అధికారులు అమలు చేసే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఆఫ్ లైన్ లోనూ.. కాగితాలపై మాత్రమే పనిచేయడం అలవాటు చేసుకున్న అధికారులకు ఇపుడు ఈ-ఆఫీస్ విధానం కొత్తగా వుంది. అంతేకాదు ఏ శాఖ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయనే విషయం ఈ-ఆఫీస్ డ్యాష్ బోర్డులో తెలిసిపోతుంది. తద్వారా అధికారులు, సిబ్బంది పనితీరు కూడా జిల్లా కలెక్టర్ కు ఇట్టే తెలిసిపోతుంది. దానితో ఈ-ఆఫీస్ అమలు చేయడానికి జిల్లాశాఖల అధికారుల నుంచి మండల శాఖ అధికారులు సిబ్బంది వరకూ ఇంటర్ నెట్ ను సాకుగా చూపిస్తున్నారు. చాలా మంది అధికారులకు టెక్నాలజీపై అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణం అవుతున్నది. దానితో జిల్లా కలెక్టర్ ఆదేశాలకు సాంకేతిక మోకాలడ్డుతున్నది.

-ఈ-ఆఫీస్ పర్యవేక్షణ ఎక్కడ..!
సాధారణంగా ప్రభుత్వం ఆదేశించిన విధానంపై జిల్లా కలెక్టర్లు జిల్లాశాఖల అధికారులు, సిబ్బందికి అవే ఆదేశాలను జారీ చేస్తారు. అయితే ఇపుడు ఆ ఆదేశాలు ఈ-ఆఫీసు విధానంతో అమలయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో చాలా వరకూ చేసే పనులన్నీ చాలా తేడాగానూ.. కమిషన్లలలోనూ జరుగుతుంటాయి. పైసలు పడితే తప్పా పనులు జరగని పరిస్థితి కూడా వుంటుంది. కానీ ఈ-ఆఫీసు విధానంతో నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాల్సి వుంటుంది. అలా చేసే క్రమంలో అధికారులకు, సిబ్బంది వచ్చే కమిషన్లు, మామూళ్లు పోతాయి. అలా చేయాలంటే ఈ-ఆఫీస్ విధానంలో కాకుండా ఆఫ్ లైన్ లో చేస్తుంటారు పనులన్నీ..కానీ జిల్లా కలెక్టర్ వస్తూ వస్తూనే పనులన్నీ ఈ-ఆఫీస్ లోనే జరగాలని ఆదేశించినా..దానిని జిల్లా శాఖల అధికారులు మండల అధికారులు పట్టించుకున్నట్టుగా ఎక్కడా కనిపించలేదని సమాచారం అంతుంది.

-సచివాలయాలకు అనుసంధానిస్తారా..?
అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ప్రభుత్వశాఖలతోపాటు, గ్రామ సచివాలయాలకు కూడా ఈ-ఆఫీస్ అనుసంధానిస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం వుంటుంది. అందులోనూ సచివాలయ ఉద్యోగులుందరూ ఉన్నత విద్యావంతులేకాకుండా.. ఐటీ కార్యాకలాపాల్లో చేయిన తిరిగిన వారు కూడా. తద్వారా జిల్లా శాఖలకు ఈ-ఆఫీసు విధానంలో ఫైల్స్ కూడా అధికంగా రావడానికి ఆస్కారం వుంటుంది. అలా కాకుండా కేవలం ఈ-ఆఫీసుని మండల కార్యాలయాలకే పరిమితం చేస్తే.. అనుకున్న ఫలితాలు రాకపోగా.. ఆఫ్ లైన్ లోనే కార్యక్రమాలు జరగడానికి మాత్రమే ఆస్కారం వుంటుంది. కారణం చాలా మంది మండల అధికారులకు ఈ-ఆఫీసు విధానంలో పనిచేయడం రాకపోవడం.. ప్రతీ పనికీ క్రింది స్థాయి సిబ్బంది లేదా..సచివాలయ ఉద్యోగులపైనే ఆధారపడటం వలన జిల్లా కలెక్టర్ కి ప్రభుత్వం ఆదేశించిన ఈ-ఆఫీసు విధానం అమలు అమలు అయ్యే అవకాశం దాదాపుగా లేనట్టే.

-ఈ-ఆఫీస్ అమలు కాకపోతే భారీ ఎత్తున అవినీతి
ఈ-ఆఫీస్ విధానం అమలు కాకపోతే జిల్లాలో భారీ ఎత్తున అవినీతి కొనసాగడానికి వీలుంటుంది. దాని ప్రధాన ఉదాహరణ కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలో పనులుచేసినట్టుగా చూపించి.. ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చులు చూపించిన వైనమే దీనికి కారణం. ఇక్కడ 2023 నుంచి సుమారు రూ.80లక్షలు ఖర్చులు చూపించినా.. దేనికీ ఆధారాలు లేవు. కాకపోతే ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడికక్కడ మామూళ్లూ ఇస్తూ వచ్చారు. ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చినా కొయ్యూరు మండల ఎంపీడీఓ, డీఎల్పీఓ, డీపీఓ ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. అదే ఈ-ఆఫీసు విధానం అమలులో ఉంటే ప్రతీ ఫైలు జిల్లా కలెక్టర్ వరకూ వరకూ వస్తుంది.. తేడా ఖర్చలు.. పనులు చేయకుండా పెట్టిన బిల్లులు అన్నింటిపైనా అప్పటి కప్పుడే విచారణ చేయడానికి కూడా ఆస్కారం వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అల్లూరి జిల్లాలో ఈ-ఆఫీసు అమలు జిల్లా కలెక్టర్ కి ఒక సవాల్ లాంటిదేనని చెప్పొచ్చు.