(ఈఎన్ఎస్-విశాఖపట్నం, గాజువాక, భీమిలీ, అనకాపల్లి)
స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 లో జీవీఎంసీ చేపట్టిన సృజనాత్మక కార్యాచరణలో భాగంగా “వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీలు దేశంలోనే జీవీఎంసీ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుందని , నగరంలో గల వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు,స్వతంత్ర మెటల్ ఆర్టిస్టులు పనికిరాని స్క్రాప్ వస్తువులతో నగరానికి వన్నె తెచ్చేలా కళాఖండాలను తయారు చేసేవారికి అద్భుత అవకాశమని, అద్భుత కళాఖండాలను సృష్టించేందుకు నగర సృజనాత్మకులు అన్ని జోన్లలో అధిక సంఖ్యలో పాల్గొని, సృష్టించిన కళాఖండాలను 2026 ఏప్రిల్ 10వ తేదీలోగా జీవీఎంసీ కి అందించాలని, ప్రతి జోన్లో ప్రథమ బహుమతి గా ఒక లక్ష , ద్వితీయ బహుమతి 50 వేలు, తృతీయ బహుమతి 25 వేలరూపాయలు, 10 ప్రోత్సాహక బహుమతులు ( ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున) మొత్తంగా అన్ని జోన్లలో 22 లక్షల 50 రూపాయల నగదు బహుమతులను గెలుచుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ వివరిస్తూ పనికిరాని స్క్రాప్ వస్తువులను సృజనాత్మకంగా వినియోగించి కళాఖండాలుగా మలచడం ద్వారా నగర సౌందర్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నం లో గల వెల్డింగ్ షాపులు, మెటల్ ఫ్యాబ్రికేటర్లు, స్వతంత్ర మెటల్ కళాకారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
పోటీదారులు 80 శాతం ఇనుప స్క్రాప్, ఆటో వేస్ట్ ఉపయోగించి 4 నుండి 8 అడుగుల శిల్పాన్ని తయారు చేయాలని, జీవీఎంసీ పరిధిలో రిజిస్టర్ అయిన వెల్డింగ్ షాపులు,ఫ్యాబ్రికేషన్ యూనిట్లు,స్వతంత్ర మెటల్ ఆర్టిస్టులకు జీవీఎంసీ అన్ని జోన్లలో ఈ పోటీలు నిర్వహణ జరుగునన్నారు. ప్రతి జోన్ కు మొదటి బహుమతి: రూ. 1,00,000/-, రెండవ బహుమతి: రూ. 50,000/-, మూడవ బహుమతి: రూ. 25,000/- ప్రోత్సాహక బహుమతులు: 10 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున నగదు బహుమతులు మొత్తంగా అన్ని జోన్లకు కలిపి 22 లక్షల 50 వేల రూపాయల బహుమతులు ,పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేయబడతాయన్నారు. ఈ పోటీలో వెంటనే పాల్గొని ఆఖరి తేదీ అయిన 2026 ఏప్రిల్ 10 లోగా మీరు సృష్టించిన కళాఖండాలను జీవీఎంసీ కి అందించాలని,ఆసక్తి గల ఔత్సాహికులు వెంటనే ఆన్లైన్ లింక్ https://pgi.billdesk.com/pgidsk/pgmerc/gvmc/ GVMCDetails.jsp ద్వారా మీ పేరును నమోదు చేసుకోవాలని ,అధికారిక పోస్టర్‌లో అందుబాటులో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి కూడా నమోదు చేసుకోవచ్చునని,మరిన్ని వివరాల కొరకు మీ సమీపంలో గల సచివాలయం వార్డు శానిటేషన్,ఎన్విరాన్మెంట్ సెక్రటరీలను సంప్రదించవచ్చు నన్నారు.
ఈ పోటీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన "వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీల యొక్క జీవీఎంసీ పోస్టర్ ను నేడు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం తన ఛాంబర్ లో జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, కార్యదర్శి బి.వి.రమణలతో కలిసి ఆవిష్కరించడమైనదని కమిషనర్ తెలిపారు. నగరంలో మీకంటూ ఒక గుర్తింపుగా ఈ పోటీలో గెలుపొందిన మీరు సృష్టించిన శిల్పాలను జీవీఎంసీకి అందజేయాలని వాటిని విశాఖపట్నంలో గల ప్రధాన రహదారుల కూడళ్లలో పాల్గొన్న వారి పేరుతో ప్రతిష్ఠిస్తామన్నారు.ఈ కార్యక్రమం ద్వారా బ్రాండ్ వైజాగ్ మరియు గ్రీన్ వైజాగ్ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావచ్చునన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగర పర్యావరణ పరిరక్షణతో పాటు సృజనాత్మకతకు ప్రోత్సాహం లభిస్తుందని, విశాఖ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అర్హులైన వారందరూ ముందుకు రావాలని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తుందని కమిషనర్ తెలిపారు.