(ఈరోజు ప్రధాన ప్రతినిధి-విశాఖపట్నం)
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మిశ్రమ ఫలితాలు చవిచూడబోతున్నది. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం కాబోతుందని ఓటు వేసిన ప్రజల ఓటింగ్ సరళి స్పష్టం చేస్తున్నది. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలోనే కేవలం 50.2 శాతం శాతం మాత్రమే ఓటింగ్ జరిగినట్టు అధికారులు తొలుత ప్రకటించి తరువాత దానిని 56.32 శాతానికి పెరిగిందన్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వివరణ ఇవ్వాలని ప్రజలు.. ప్రజా సంఘాలు పట్టుబట్టడం.. నామినేషన్ సమయంలో రాష్ట్రంలో చాలా చోట్ల కూటమి అభ్యర్ధులుు వైఎస్సార్సీపీ అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు చించేయడం.. లాగేసుకోవడం.. అవి ప్రధాన అస్త్రాలు చేసుకున్న కూటమికే దెబ్బకొట్టినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుందామనుకుంటే.. చేసిన తప్పులు ఎన్నికలకు ముందే ప్రజల ముందు ఆధారాలతో సహా రావడం కూడా కూటమి ఫలితాలకు ఆటంకం అయివుతాయని చెబుతున్నారు..!
-విశాఖలో డేటాసెంటర్ పై నిరసన క్రాస్ ఓటింగ్ కి కారణమా..?
రాష్ట్రంలో అతి పెద్ద నగరపాలక సంస్థ జీవిఎంసికి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పన్న భూములు డేటా సెంటర్ కి కేటాయించడాన్ని చదువుకున్న తీవ్రంగా వ్యతిరేకించింది. పర్యావరణ వేత్తలు.. విశాఖవాసులు కూడా అప్పన్న భూములు ప్రైవేటు సంస్థలకు కేటాయించి పచ్చని కొండలకు గుండ్లు కొట్టిన ఫలితం ఎన్నికల్లో చూపిస్తుందని.. దానికి అప్పన్న ఉగ్రరూపమే కారణం అవుతుందని కూడా పెద్ద చర్చకు తెరలేపారు. అలా చెప్పటినట్టుగానే చాలా మంది తమ ఓట్లను నోటాకి వేసినట్టు బయటకు పొక్కింది. అంతేకాకుండా విశాఖను కాపాడుకుందాం నినాదం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగానే పనిచేసిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ఈ నగర పోరులో నోటా గుబులు అధికారపార్టీ అభ్యర్ధులతోపాటు.. వైఎస్సార్సీపీ... స్వతంత్ర అభ్యర్ధులను కూడా తీవ్రంగా భయపెడుతున్నది.
-ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కొట్టిన దెబ్బే పెద్దది..
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు పెండింగ్, పదోన్నతులు పెండింగ్, పీఆర్సీ పెండింగ్, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ అంశాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రివర్స్ ఓటింగ్ పడటానికి, క్రాస్ ఓటింగ్ పడటానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పేరుతో రాజకీయం చేసి.. ఏమీ చేయకుండా రెండున్నరేళ్లు గడిపేయడం, ఉద్యోగులపై కేసులు, విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలను పట్టించుకోకపోవడం..75 ప్రభుత్వ శాఖలుంటే 75వ ప్రభుత్వశాఖ గా ఉన్న సచివాలయ ఉద్యోగులపైనే పని భారం మోపి వారి చావులకు, సస్పెషన్లకు, ప్రయోజనాలు కల్పించకుండా రాజకీయం చేయడానికి కారణం కావడం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రివర్స్ ఓటింగ్ పడటానికి ఒక ప్రత్యేకం కారణమని ఉద్యోగులందరూ బాహాటంగానే ప్రకటించారు. తామేంటే ఎన్నికల్లో తమ ఓటు పవర్ తో చూపిస్తామని కూడా ఎన్నికలకు ముందే దైర్యంగా ప్రకటించారు కూడా..
-అమలు చేయని సంక్షేమ పథకాలు కొంపముంచాయా..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఆర్ధిక పరిస్థితులు ఉన్నా ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ సకాలంలో వచ్చేవి. కానీ ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేకపోవడం.. ప్రచారానికి చేస్తున్న ఖర్చు సంక్షేమ పథకాల అమలకు ఖర్చుచేయకపోడం.. ప్రజలకిచ్చిన హామీలు అమలు కాకపోవడం కూడా మహిళా ఓటు బ్యాంకు నుంచి వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. బాబు కంటే జగనే బెటర్..అందుకే తమ ఓటు జగన్ పార్టీకే వేశామని కూడా చాలా మంది మహిళలు ఎన్నికల రోజు దైర్యంగా ప్రకటించడం కూడా విశేషం. అందులోనూ నేతల సమన్వయ లోపం, రెబల్స్ ఎక్కువైపోవడం.. ఇండిపెండెంట్లు కూడా కూడా భారీగా డబ్బులు పంచడం వంటి అంశాలు కూడా రవర్స్ ఓటింగ్ కి కారణమని చెబుతున్నారు. అదే సమయంలో డిఎస్సీలో లోపాలు, జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల వ్యతిరేక ప్రచారం, వైఎస్సార్సీపీ కూడా ప్రజల్లోకి కూటమి చేసిన తప్పనులను తీసుకెళ్లడం.. పెద్ద ఎత్తున కూటమి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్లను నియమించుకున్నా ఫలితం లేకపోవడం.. ప్రజలను రంజింపచేయలేకపోవడం వంటి అంశాలు వ్యతిరేక పవనాలకు కారణమని చెబుతున్నారు.
-మేయర్ అభ్యర్ధిపైనే నగరమంతా చర్చ
విశాఖ నగర మేయర్ అభ్యర్ధి గెలుపుపైనే ఇపుడు నగరమంతా తీవ్రమైన చర్చ నడుస్తుండగా.. తాజాగా మెజార్టీ కూడా వస్తుందని.. అదీ వైఎస్సార్సీపీకే వస్తుందని చాలా చోట్ల బెట్టింగులు కట్టడం కూడా కొసమెరుపు. మేయర్ అభ్యర్ధి ఎంపికలో చాలా మంది సీనియర్లు ఉన్నా.. ప్రజల్లో లేని వ్యక్తిని తెరపైకి తీసుకు రావడంతో సీటు ఆశించిన వారు కూడా వ్యతిరేకంగా పనిచేశారని సమాచారం అందుతుంది. బయటకు పార్టీ ఆదేశాలు పాటిస్తున్నట్టు రాజకీయరంగు పులుపుకున్నా.. తాము అనుకున్నవారికి సీటు రాలేదనే బాధ, కడుపు మంటతో తెరచాటు ఓటుబ్యాంకు రాజకీయం చేశారని కూడా చెబుతున్నారు. అటు వైఎస్సార్సీపీ అభ్యర్ధి కూడా ఒక వర్గం మీడియాకే ప్రయోజనాలు కల్పించి మిగిలిన వారిని ప్రక్కన పెట్టినా.. కాస్త వాయిస్ బలంగా ఉండటంతో కొందరు మీడియా కుటుంబాలు కూడా వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్ధికి పక్కాగా తమ ఓట్లు గుద్దినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి కబురు చేరవేసినట్టుగా చెప్పడం.. నగరంలో చాలా చోట్ల ఇపుడు మేయర్ అభ్యర్ధి గెలుపుపై పెద్ద పెద్ద చర్చలకు కారణం అవుతున్నది. తే ఈరోజు-ఈఎన్ఎస్ ఆది నుంచి చెబుతున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక నుంచి ఓటు బ్యాంకు చీలిక వరకూ అన్నీ పక్కగా జరుగుతూ వచ్చాయి..నేడు రాబోయే ఫలితాలు కూడా అదే విధంగా వస్తే..ఈరోజు-ఈఎన్ఎస్ ప్రిడిక్షన్ ఒమ్ముకాలేదని ఓట్లేసిన వారంతా కూడా బల్లగుద్ది చెబుతారు.. చూడాలి.. మరికొద్ది గంటల్లో ఫలితాలు ఎవరికి పట్టం కట్టబోతున్నాయో..?!




