(అల్లూరి సీతారామరాజు-ఈరోజు, ఏప్రిల్ 04)అల్లూరి జిల్లా అరకువేలి, పాడేరు, పెదబయలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 30 సెకెన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక నిద్రిస్తున్నవారు కూడా భయంతో భయటకు పరుగులు తీశారు. అయితే.. ఆ తరువాత అంతా సద్దుమగడంతో చాలా సేపు గిరిజనులంతా బయటే ఉండిపోయారు. ఎన్నడూలేనివిధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కొంది ఇళ్లల్లో సామాన్లు కూడా క్రింద పడిపోయాయి. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. అయితే ఈ ప్రకంపనలపై అధికారులు జిల్లా కలెక్టరేట్ కి సమాచారం అందించారు. రెండు రోజులుగా దేశంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపిస్తుండటంతో.. ఎప్పుడు ఏ ప్రాంతంలో భూమి కంపిస్తుందోనని అంతా భయపడుతున్నారు. అయితే శనివారం రాత్రి ఈ ప్రకంపనలు రావడంతో అక్కడే బసచేసి ఉన్న కొందరు పర్యాటకులు కూడా భయాందోళనకు గురయ్యారు. కాగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదు అయ్యింది. ఇది తీవ్రమే అంటున్నారు.