(ఈరోజు-అనకాపల్లి, అల్లూరి పాడేరు, విశాఖపట్నం)
తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక పత్రికలకు ఫాంట్ కన్వర్టర్ కష్టాలకి ఇక చెల్లుచెటీ చెప్పాల్సిన సమయం వచ్చింది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఫాంట్ కన్వర్టర్ లు కొనుగోలు చేసే పనిలేకుండా ఈరోజు న్యూస్ ఏజెన్సీ, అధికారిక వెబ్ సైట్ https://www.eeroju.com/unicode-to-anu-converter/# ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. అల్లూరి ఆశయసాధనే ఈరోజు దినపత్రిక రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ ఏట అడుగు పెడుతున్న వేళ స్థానిక పత్రికలకి సుదీర్ఘ సేవచేయాలనే లక్ష్యంతో యునీకోడ్ టు అను ఫాంట్ కన్వర్టర్ వెబ్ సైట్ ని పత్రికల నిర్వాహకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు నిర్వాహకులు, ప్రధాన సంపాదకులు పి.బాలభాను(ఈరోజు బాలు) తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు.
పత్రిలక నిర్వహాకులు పత్రికల కోసం ఏదైనా సేవ చేయాలని అనుకున్నప్పుడు.. పత్రికలు ఫాంట్ కన్వర్టర్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఉచితంగా ఈ ఫాంట్ కన్వర్టర్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఒక్క పైసా కూడా ఎవరికీ చెల్లించే పనిలేకుండా ఉచితంగానే ఎప్పుడైనా..ఎక్కడైనా దీనిని వినియోగించుకొని పత్రికల డిజైనింగ్ కి కావాల్సిన వార్తలు.. యూనికోడ్ నుంచి అను ఫాంట్(ప్రియాంక)లోకి మార్చుకోవచ్చునన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేలా సుమారు పదేళ్ల వరకూ డొమైన్, ప్రత్యేకంగా హోస్టింగ్ సర్వర్ కూడా తీసుకున్నామని తెలియజేశారు. పత్రికల నిర్వాహకులందరికీ తెలిసే ఫాంట్ కన్వర్టర్ వెబ్ సైట్ ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
పత్రికలు నిర్వహించేవారు నిరాటంకంగా ఈరోజు డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా ఫాంట్ కన్వర్టర్ సేవలు పొందవచ్చునన్నారు. ఈ ఉచిత వెబ్ సైట్ సమాచారాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అందరు పత్రికల యజమానులకు తెలిసే విధంగా మార్కెటింగ్ కూడా చేపడుతున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఉచిత యునీకోడ్ టు అను ఫాంట్ కన్వర్టర్ వెబ్ సైట్ సర్వీసులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన సంపాదకులు పి.బాలభాను(ఈరోజు బాలు) ఆ ప్రకటనలో కోరారు.




