(ఈరోజు-విశాఖపట్నం ప్రధానప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు (గ్రామ/వార్డు సచివాలయం) సిబ్బంది ప్రమోషన్లను ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మెమో (నెం. 3266486) జారీ చేశారు. మంత్రుల కమిటీ నిర్ణయం ఆఖరి సమావేశం సోమవారం జరిగిన తరువాత వెంటనే చర్యలు ప్రారంభించారు. పదోన్నతులతో కూడా పేస్కేళ్లను ఖరారు చేశారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్-ఇన్-చీఫ్ తదితర లైన్ డిపార్ట్‌మెంట్లు ఈ ప్రమోషన్లపై వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు ప్రమోషన్ల ప్రక్రియను ఖరారు చేసిన శాఖలు, తమ పరిధిలోని సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నాయి. శాఖల వారీగా ప్రత్యేక జీవోలు కూడా రానున్నాయి.

- కొత్తగా ఏర్పాటయ్యే ఇంటర్మీడియట్ పోస్టులు:
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు / వార్డ్ అమినిటీస్ సెక్రటరీలకు ప్రమోషన్ల కోసం 'సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్' అనే కొత్త మధ్యంతర పోస్టును క్రియేట్ చేయడానికి మంత్రుల కమిటీ అంగీకరించింది.అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు / వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 'వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రేడ్-1 / వార్డ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీ గ్రేడ్-1' అనే కొత్త పోస్టును క్రియేట్ చేయడానికి ఆమోదం లభించింది.

-ప్రమోషన్లు, కొత్త జీతాల స్కేళ్లు
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయడానికి అంటే.. రూ. 25,220 - 80,910 , వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కి రూ. 23,120 - 74,770, వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-2 వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-1 పేస్కేలు రూ. 23,780 - 76,730, వార్డ్/గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) సీనియర్ మహిళా పోలీస్ వీరికి రూ.28,280 - 89,720, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గ్రేడ్-2 లకు వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గ్రేడ్-1 రూ. 25,220 - 80,910, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5లకు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఇచ్చి రూ.25,220 - 80,910 అమలు చేయబోతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6) పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 ఇచ్చి రూ.23,120 - 74,770, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2 కి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-1 ఇచ్చి రూ.25,220 - 80,910 , వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-2కి వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ గ్రేడ్-1 ఇచ్చి రూ.23,780 - 76,730, వార్డ్ అమినిటీస్ సెక్రటరీ గ్రేడ్-2కి వార్డ్ అమినిటీస్ సెక్రటరీ గ్రేడ్-1 ఇచ్చి రూ. 23,780 - 76,730, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్-2కి వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్-1 ఇచ్చి రూ.23,780 - 76,730,

వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3కి వార్డ్ హెల్త్ సెక్రటరీ ఏంపీహెచ్ఏ ఫిమేల్ ఇచ్చి రూ.32,670 - 1,01,970 , విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 ఇచ్చి రూ. 34,580 - 1,07,210, ఫిషరీస్ అసిస్టెంట్ లకు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇచ్చి రూ. 32,670 - 1,01,970 ఇవ్వనున్నారు. ఇక యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ వెటర్నరీ అసిస్టెంట్ కేటగిరికీ వన్ కి రూ. రూ.29,980 - 94,500,
, హార్టికల్చర్ అసిస్టెంట్ లకు హార్టికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఇచ్చి రూ. 25,220 - 80,910, సెరికల్చర్ అసిస్టెంట్ లకు టెక్నికల్ అసిస్టెంట్ (సెరికల్చర్) రూ. 23,780 - 76,730, విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 లకు విలేజ్ సర్వేయర్ గ్రేడ్-2 అయితే వీరికి (స్కేల్ ఇంకా ఖరారు కాలేదు) |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2కి (ప్రమోషన్ ఛానల్ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా ఖరారైంది, స్కేల్ ఇంకా ఖరారు కాలేదు), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు ప్రమోషన్ ఛానల్ గ్రేడ్-1 గా ఖరారైంది పేస్కే ఇంకా ఖరారు కాలేదు).

సచివాలయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల బాధ్యతలను జనరల్ పర్పస్ ఉద్యోగులు నిర్వహించేలా వారి విధులను సర్వగ్రామ, స్వర్ణ వార్డు శాఖ ఖరారు చేస్తుంది. అదే సమయంలో శాఖల్లో అధికంగా ఉన్న ఉద్యోగులను రేషనలైజేషన్ తర్వాత సిబ్బందిలో, ఎక్కువ అర్హతలు ఉన్నవారిని ప్రభుత్వ అనుమతితో ఇతర శాఖలకు డెప్యుటేషన్‌పై పంపే ఆలోచన చేస్తున్నది. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ పోస్టుల జీతాలలో సమానత్వం ఉండేలా లైన్ డిపార్ట్‌మెంట్లతో కలిసి తగిన స్కేళ్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ సూచించేలా కూడా మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ ప్రధార కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.