(ఈరోజు-అనకాపల్లి, నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి)
వేసవి కాలం వచ్చిందంగే టక్కున గుర్తొచ్చేది మామిడికాయ.. మరి మామిడికాయతో పప్పు, పచ్చడి, ఆవకా మాత్రమే మనందరికీ తెలుసు.. ఇపుడు చాలా మామిడికాయతో పులిహోర కూడా చేస్తున్నారు. సక్రమంగా చేయడం రాకపోతే మళ్లీ ఆ పులిహోర జోలికెళితే ఒట్టు.. అదే చెప్పిన కొలతలతో పెర్ ఫెక్ట్ గా చేస్తే.. ఎప్పుడు మామిడికాయలు కనిపించినా మనసు పులిహోర మీదకే లాగేంతగా మనసులో గుర్తిండిపోతుంది ఈ మామిడికాయ్ పులిహోర. మందికి టేస్ట్ సరిగా రాదు.. పులుపుగానో చప్పగానో అవుతుంది. ఫర్ ఫెక్ట్ కొలతలతో మామిడికాయ పులిహోర చేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. అలాంటి రుచికరమైన మామిడికాయ్ పులిహోర కోసం ఇపుడు మనం తెలుసుకుందాం..

-మామిడికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
1)వండి వార్చుకున్న అన్నం ఒక కిలో, 2)పచ్చిమామిడికాయ తురుము ఒకటిన్నర కప్పు, 3)వేరుశనగ పప్పు ఒక కప్పు, 4)శనగపప్పు, మినప్పప్పు తలో ఒక టేబుల్ స్పూన్, 5)ఆవాలు ఒక టేబుల్ స్పూన్, 6)పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, 7)జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, 8)ఇంగువ అర టేబుల్ స్పూన్, 9)కరివేపాకు నాలుగు రెబ్బలు, 10)ఉప్పు తగినంత, ప11)చ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు చీల్చినవి, 12)బెల్లం తురుము కొద్దిగా, 13) ఎండుమిర్చి నాలుగు, 14)నూనె అర కప్పు తీసుకోవాలి.

- పులిహోర తయారీ విధానం
ముందుగా పచ్చిమామిడికాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి సన్నగా తురుముకొని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు వండిన అన్నం( అన్నం ఉడికేటపుడు కాస్త మంచినూనెను వేసుకోవాలి.. తద్వారా పులిహోర పొడి పొడిగా వస్తుంది) చల్లారిన తర్వాత, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపుకొని.. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పప్పులను వేసి వేయించుకోవాలి. ఆ తరువాత తాలింపులో మామిడికాయ తురుము వేసి, మామిడికాయ తురుమును పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. అలాగే అందులో బెల్లం తురుము కూడా కలిపి నూనె పైకి తేలేంత వరకూ చక్కగా వేయించుకోవాలి. దానితో మామిడికాయ తురుము పులిహోరకి సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఉడికిన మామిడికాయ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి నాలుగు వైపుల నుంచి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం ఉడికించిన అన్నంలో బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మామిడికాయ పులుపు సరిచూసుకోవాలి. ఇక్కడ అవసరం అనుకుంటే రుచికి తగ్గట్టుగా ఉప్పుని అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అలా మామిడికాయ పులిహోరను ఒక గంటపాటు పక్కన పెట్టేయాలి. ఆ సమయంలోపులిహోర బాగా తయారవుతుంది. గంట ఆగిన తరువాత సర్వ్ చేరసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ మామిడికాయ పులిహోర ముద్ద ముద్దలోనూ బాగా ఎంజాయ్ చేయొచ్చు.

-పులిహోరకి ఎప్పుడూ కొలతలు చాలా ఉపయోగపడతాయ్
ఏ పులిహోర చేసిన వస్తువుల కొలతలు చాలా బాగా ఉపయోగపడతాయ్ అంతేకాకుండా పులిహోరకి మంచి రుచిని కూడా ఇస్తాయ్.. పులిహోర ఎప్పుడు చేసుకున్నా కరివేకాపు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అదే సమయంలో కొంత మందికి పల్లీలు, పోపు గింజలు ఎక్కుగా తగిలితే చాలా ఇష్టం అలాంటి వారు పల్లీలు కూడా దోరగా మాత్రమే వేయించుకొని వేసుకోవాలి. ఇంగు వేసే టపుడు కూడా కాస్త జాగ్రత్తలు పాటించి రుచికి తగ్గుట్టుగా మాత్రమే వేసుకోవాలి లేదంటే పులిహోర వెగటుగా వచ్చేస్తుంది. పులిహోర ఎప్పుడు చేసుకున్నా.. అన్నవం వండుకునేటపుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవడం ద్వారా అన్నం పొడి పొడిగా వస్తుంది. మరీ ముఖ్యంగా మామిడికాయ్ పులిహోర చేసుకునేటప్పుడు తురుము చాలా చక్కగా ఉండాలి. అది మనం మిశ్రమం చేసుకున్నప్పుగా బాగా కలుస్తుంది. అలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలు గా వస్తే అది దాని స్వభావాన్ని కోల్పోతుంది. పక్కా కొలతలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎలాంటి వంకమైనా ఆహా ఏమి రుచి అంటా తినాల్సిందే తప్పదు..!