(అనకాపల్లి-ఈరోజు, మార్చి 17)

అనకాపల్లి జిల్లా ప్రజలు మెచ్చిన కలెక్టరమ్మ విజయక్రిష్ణణ్ ఆలోచన మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రం దృష్టి అనకాపల్లి జిల్లాను తొంగిచూసేశాల చేసింది. 13 జిల్లాలు 28 జిల్లాలుగా మారిన తరుణంలో ఆమె ఉక్కు సంకల్పం అభివృద్ధి చెందుతున్న జిల్లాల సరసన టాప్ త్రీ ప్లేస్ ను కైవసం చేసుకుంది. దానికి గుర్తుగా జిల్లాలోని అధికారులంతా కలిసి రెవిన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఆత్మీయ సత్కారం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ పరిపానను కొనియాడారు. రాష్ట్రంలోనే టాప్ 5 జిల్లాల్లో అనకాపల్లికి చోటు దక్కిందంటే దానికి కారణం కలెక్టర్ అభివృద్ధి మంత్రమేనని కొనియాడారు. విభజన జిల్లా అయినప్పటికీ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ పరిపాలన దక్షత కారణంగా అనేక రంగాల్లో ఎంతో పెద్ద గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లోని వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ రాష్ట్రప్రభుత్వాన్నే కదిలించి ఆ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సాక్షత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడం జిల్లాకే గర్వకారణమన్నారు. నిన్నటి వరకూ ప్రజలు మెచ్చిన కలెక్టరమ్మగా ఉన్న మన కలెక్టర్ ఆలోచన రాష్ట్రప్రజలు మెచ్చే కలెక్టరమ్మ స్థాయికి చేరుకున్నాయని అధికారులు కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


-అధికారుల సమన్వయంతో ఏదైనా సాధించవచ్చు

జిల్లా కలెక్టర్ఒక జిల్లాలో పనిచేసే యంత్రాంగం సమన్వయంతో ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణణ్ నమ్ముతారు. ఆమె ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక అభివృద్ధి శిలాఫలకం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తారనే పేరుని ఆమె వెంట నేటికీ తిరుగుతూనే వుంటున్నది. ఒక అధికారి ఉన్నతంగా ఆలోచిస్తే అది ప్రభుత్వానికి పేరు తీసుకురావడంతోపాటు.. ప్రజలకు నిశ్వార్ధంగా సేవలు అందించడానికి కూడా ఎంతో ఉపకరిస్తుందని అంటారామె. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ఆమె అభివృద్ధి మంత్రాన్ని కొందరు ప్రతిష్ట దిగజార్చాలని చూసినా దానిని వారి ఆలోచనలకే వదిలేస్తూ.. ఏమీ పట్టనట్టు జిల్లా అభివృద్ధి కీలక భూమిక వహిస్తారు. అలాంటి తరుణంలో ఉమ్మడి జిల్లాలు సాధించలేని కీర్తిని విభజన జిల్లాగా మారిన అనకాపల్లి సాధించడంలో కలెక్టర్ పరిపాలన, అభివృద్ధి దృష్టి జిల్లా కీర్తిని రాష్ట్రంలో మరోసారి రెప రెపలాడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న సహకారం, ప్రజలు ఆమె సేవలకు బ్రహ్మరధం పట్టి.. హారుతలు ఇవ్వడం కూడా జిల్లా కీర్తిలో భాగమవుతున్నాయి.