(ఈరోజు-అల్లూరి పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, యలమంచిలి)
ఆలూ బోండాలను మనం ఇంట్లో ట్రై చేసినప్పుడు ఆశించిన స్థాయిలో పర్ఫెక్ట్‌గా రావు దానికి కారణాలు చాలానే ఉంటాయి. అయితే, హోటల్ స్టైల్‌లో ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా, క్రంచీగా ఉండే ఆలూ బోండాలను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఇక్కడ డిటేల్డ్ గా ఇచ్చిన రెసిపీని చదువుతూ వన్ బై వన్ ఇంగ్రీడియన్స్ కలుపుకొని చేసుకుంటే.. అపుడు మీరు అనుకున్న స్టైల్ లో పెర్ ఫెక్ట్ గా రావడానికి ఆస్కారం వుంటుంది. పక్కా కొలతలతో ఆలూ బోండా స్ట్రీట్ ఫుడ్ స్టైలో ఏ విధంగా చేయాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం. మేము చెప్పినట్టుగా చేస్తే ఆలూ బోండా మీరు ఊహించిన దానికంటే ఎంతో చక్కగా.. మరింత రుచిగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానితో మీకు ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది.
-ఆలూ బోండాకి కావలసిన పదార్థాలు
ఆలూ స్టఫింగ్ కోసం ఉడికించిన బంగాళాదుంపలు (ఆలూ) –4, సన్నగా తరిగుకున్న ఉల్లిపాయ –1, పచ్చిమిర్చి తరుగు –2 చెంచాలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ –1 చెంచా, కరివేపాకు, కొత్తిమీర తరుగు –కొద్దిగా, పసుపు – అర చెంచా, ఆవాలు, జీలకర్ర – పోపునకు సరిపడా, నిమ్మరసం –1 చెంచా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె –2 చెంచాలు, పైన కోటింగ్ బ్యాటర్ కోసం శనగపిండి – 1.5 కప్పు, వరిపిండి (బియ్యం పిండి) –2 పెద్ద చెంచాలు (ఇది బోండా కాస్త కర కరలాడేలా చేయడానికి సహాయపడుతుంది), కారం పొడి –1 చెంచా, వాము – అర చెంచా, వంటసోడా- చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఇక్కడ మీరు కొద్దిగా క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చే ఇది పూర్తిగా ఆప్షనల్, అన్నికంటే ముఖ్యంగా ఆఫ్ బాలయిల్ శనగపలుకులు ఇది చాలా ముఖ్యం(ఇదే ఆలూ బోండాలో ఆసలైన సీక్రెట్)
-తయారీ విధానం
మొదట ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి, వాటిని చేత్తో మెత్తగా మ్యాష్ (నలపడం) చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు చెంచాల నూనె వేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు సగం ఉడకబెట్టిన శనగ పలుకులు, క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు కూడా కలుపుకొని దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక, అందులో ముందుగా నలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. .. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ఆలూ మసాలా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న రౌండ్ బాల్స్ (ఉండలు) లా చేసుకుని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వాము చిటికెడు వంటసోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బజ్జీల పిండిలా (మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా) జారుడుగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి.
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఒక్కో ఆలూ మసాలా బాల్‌ను తీసుకుని, శనగపిండి మిశ్రమంలో ముంచి, పిండి అంతటా పర్ఫెక్ట్‌గా కోటింగ్ అయ్యాక జాగ్రత్తగా నూనెలో వేయాలి. బోండాలను మీడియం మంటపైనే అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పైన లేయర్ క్రిస్పీగా మారిన తర్వాత వాటిని నూనె నుండి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లలోకి మార్చుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, కరకరలాడే హోటల్ స్టైల్ ఆలూ బోండా రెడీ! దీన్ని వేడివేడిగా పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే సాయంత్రం పూట అద్భుతమైన స్నాక్ అయిపోతుంది. ఆలూ బోండా ప్రియులైతే మీ వంటకాన్ని రుచి చూసి ఫిదా అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ కూడా వెంటనే ఈ రెసిపీ డిటేల్డ్ గా ఒకటికి రెండు సార్లు చుదువుకొని.. లేదా.. www.eeroju.com వెబ్ సైట్ లో చూస్తూ.. చేసేయండి..!




