(ఈరోజు-అల్లూరి పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి)
పిల్లలకు ఎంతో నచ్చే స్నాక్స్ మూరీ మిక్సర్ ఒకటి.. ఏంటి మూరీ మిక్సర్ అంటే తెలియడం లేదా.. అదేనండీ బొరుగులు మిక్సర్.. పుల్ల పుల్లగా కారంగా చిటికెలో ఎప్పుడు కావాలంటే అపుడు చేసుకుంటాం కదా.. గుర్తొచ్చిందా..? ఎస్.. ఆ మూరీ మిక్స్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఇష్టం. పిల్లలకు బొరుగుల గొట్టం మిక్చర్ వేసవిలో పెడితే శరీరం చల్లబడుతుంది. ఇంకా దీనిలో ఉండే పులుపు, కారం పిల్లల్లో ఉండే నీరసాన్ని కూడా తగ్గిస్తాయి. ఇంకా జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువగా విలేజ్ స్టైల్ టేస్ట్ తో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీని రుచి అలవాటు పడిన పిల్లలు పదే పదే దీనినే చేయమని గొడవలు కూడా చేస్తుంటారు. పెద్దవారికి చేస్తే గొట్టాలు లేకుండా చేస్తారు.. అదే పిల్లలకు చేస్తే గొట్టాలు వేసి చేస్తారు.. అదే వారికి నోటికి ఇంపుగా.. కాస్త డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుంది. ఇది అన్ని కాలాల్లోనూ దొరికే స్నాక్. అందరి ఇళ్లల్లో కూడా చేసుకునే రెగ్యులర్ స్నాక్ కూడా. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. కొన్ని చోట్ల గొట్టాలు.. మరికొన్ని చోట్ల మిర్చీ బజ్జీలు.. మరికొన్ని చోట్ల అరటికాయ్ బజ్జీలు.. కొన్ని చోట్ల సమోసాలు వేసి కూడా చేస్తారు..ఒక్కో ఏరియా రుచి ఒక్కో దగ్గర వస్తుంటుంది.
-బొరుగుల గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు :
2 కప్పులు గొట్టాలు క్రంచీ , ఒక పెద్ద నిమ్మకాయ, రుచికి సరిపడా ఉప్పు, మూడు కప్పుల మరమరాలు, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర , 10 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాదారణ మిక్సర్, అరటికాయ్ బజ్జీలు, ఉడకపెట్టిన శనగలు, బటానీలు, పచ్చి టమాటా, మామిడి అల్లం, మామిడికాయ సీజన్ లో అయితే పచ్చి మామిడికాయలు, కాస్త మసాలా గ్రేవీ, రెండు పెద్ద సైజు సమోసాలు(ఇది పూర్తిగా ఆప్షననల్) ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి.
-మసాలా మిక్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి:
ముందుగా ఒక పెద్ద వెడల్పాటి పాత్ర తీసుకుని దానిలో మర మరాలు, గొట్టాలు, జీలకర్ర పొడి, ఇంకా మసాలా పొడి వేసి వాటిని బాగా మిక్స్ చెయ్యాలి. మసాలా గ్రేవీ, మామికాయ బాగా చిన్నగా కోసినది, టామాలు చిన్నగా కోసినవి, మామిడి అల్లం ఇది పూర్తిగా అప్షనల్ ఇవన్నీ అందులో కలుపుకోవాలి. ఇలా చేసి తింటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిశ్రమం రెడీ అయినా తరవాత చిన్న బౌల్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే నిమ్మరసాన్ని రసాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇదే దీనిలో ముఖ్యం ఎందుకంటే, రుచిని పెంచుతుంది. ఇంకా పాత్ర తీసుకున బొరుగుల గొట్టం మిక్చర్ వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , పుదీనా, కొత్తిమీర, సాధారణ మిక్సర్, కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పులుపు కారం మనం తినేదానిని బట్టి అడ్జెస్ట్ చేసుకోవాలి.. అరటికాయ్ బజ్జీలు, ఉడకపెట్టిన శనగలు, బటానీలు, పచ్చి టమాటాలను ఆఖరులో కలుపుకోవాలి.ఇక్కడ సమోసాలు వేయడం వేసుకోకపోవడం మీ ఇష్టాన్ని బట్టీ వుంటుంది.
-బొరుగుల గొట్టం మిక్చర్ వలన లాభాలు :
పిల్లలకు దీనిని వేసవిలో పెడితే బాడీ మొత్తాన్ని చల్లగా చేస్తుంది. ఇంకా దీనిలో ఉండే పులుపు, కారం పిల్లల్లో ఉండే నీరసం కూడా తగ్గిస్తుంది. మామిడి అల్లం వలన గొంతులో ఉండే ఖపం కరిగేలా చేస్తుంది. ఇంకా జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు కాస్త డైట్ చేసేవారు దీనిని తీసుకోవడం ద్వారా మనం ఆహారం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. రెగ్యులర్ గా దీనిని మనం ట్రేచేయొచ్చు. ఇక్కడ బొరుగులు, గొట్టం క్రష్ వేయడం వలన పిల్లలు దీనిని బాగా ఇష్ట పడతారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి వెళ్లే ముందు పెట్టడం ద్వారా ఆటలాడే టపుడు అలసట కూడా రాదు. చక్కగా చమటలు పట్టేవరకూ ఆడుకొని చక్కగా స్నానం చేసి.. ఆపై భోజనం చేసి కూడా పడుకుంటారు. ఇది పిల్లల్లో కాస్త ఆకలిని కూడా పెంచుతుందని చెబుతారు. అయితే అది మితంగా ఇస్తే జరుగుతుందని తల్లుల అభిప్రాయం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే బొరుగుల గొట్టం మిక్సర్ చేసి మీ పిల్లలకు టేస్ట్ చూపించండి..




