(ఈరోజు-అల్లూరి పాడేరు, అనకాపల్లి, నర్సీపట్నం, అరకువేలి)
క్యాబేజీ అంటే పెద్దగా ఇష్టంలేని వారు కూడా ఈ క్రిస్పీ క్యాబేజీ పకోడీని ఒక్కసారి తింటే దాని ఫేవరెట్ అయిపోతారు.. ఆతరువాత కూడా ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజీలో ఉండే స్వల్ప తీపి రుచి, మసాలాల స్పైసీనెస్‌తో కలిసిపోయి అద్భుతమైన ఫ్లేవర్‌ను తీసుకొస్తుంది. అవి ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి మనల్ని ముందుగా ప్రిపేర్ కూడా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వేడి వేడి పకోడీలు కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తే ఆ ఫీల్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా.. ఆ సమయంలో ఈ పకోడి మంచి ఫీల్ ఇస్తుంది.. ఉల్లిపకోడీతో పోలిస్తే క్యాబేజీ క్రిస్పీ పకోడీలు మరింత లైట్‌గా, ఎక్కువ క్రంచీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. పైగా ఇవి చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే సులభంగా చేసుకోవచ్చు. వీటికి పిండిలో కొంచెం సేమియా కలిపితే ఇంకా ఎక్కువ క్రంచీగా అవుతుంది. ఆ క్రిస్పీ క్యాబీజీ పకోడీలు చేసేద్దాం రండి..
-పకోడీలకు కావాల్సిన పదార్థాలు..
చిన్న సైజ్ క్యాబేజీ - 1, ఉల్లిపాయ - 1, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - 3, అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, కారం - 1 టీస్పూన్
, జీలకర్ర - అర టీస్పూన్, శనగపిండి - అర కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌స్పూన్లు (క్రిస్పీదనం కోసం), వేడి నూనె - 1 టేబుల్‌స్పూన్,
బేకింగ్ సోడా - పావు టీస్పూన్, ఉప్పు - సరిపడా,
-పకోడీలు ఈ విధంగా తయారుచేయాలి
ముందుగా ఉల్లిపాయను సన్నగా, పొడుగ్గా కోసుకోవాలి. అదేవిధ:గా పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి. క్యాబేజీని కడిగి, గ్రేటర్‌తో సన్నగా తురుముకోవాలి - సుమారు 2 కప్పుల వరకు తరిగి ఉంచుకోవాలి. ఒక పెద్ద బౌల్‌లో క్యాబేజీ తురుము, ఉల్లిపాయ (చేత్తో స్వల్పంగా నలిపి), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే సరిపడా శనగపిండి, బియ్యప్పిండి కలపాలి. ( ప్రత్యేకంగా నీరు ఎక్కడా కలపకూడదు) ఇప్పుడు వేడి నూనె 1 టేబుల్‌స్పూన్, బేకింగ్ సోడా చేర్చి బాగా కలపాలి, కడాయిలో నూనె వేడి చేయాలి. ముద్దలుగా లేదా చిన్న గారెలా తీసి నూనెలో వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తీసి టిష్యూపేపర్‌పై పెట్టుకోవడం ద్వారా అదనపు నూనె తొలగించుకోవచ్చు. ఆ తరువాత వేడివేడిగా సర్వ్ చేస్తే రుచి చూసిన వారు ఆహా అనాల్సిందే. దీనికి టమాటో సాస్, పుదీనా పచ్చడి, కారం సాస్ ఇవేం ఉన్నా టేస్ట్ మరింత పెరుగుతుంది. ఆరోజు సాయంత్రం మీకు స్నాక్ ఈవినింగ్ డే గా గుర్తిండి పోతుంది.
-పకోడీలు చేసే సమయంలో పాటించాలిన చిట్కాలు..
పకోడీలు వేసుకునేటపుడు పచ్చి కరివేపాకుతోపాటు కలిపి వేసుకోవాలి.. మధ్య మధ్యలో కొద్దిగా విడిగా కరివేపాకు, పచ్చిమిర్చిన చీల్చినవి వేపితే కలుపుకుంటే మరింత రుచాగా ఉంటాయి. పడోకీలు వేసుకునే సమయంలో పెద్ద క్యాబేజీ అయితే సగం మాత్రమే ఉపయోగించుకోవాలి. పిండిలో నీరు వేయకుండా క్యాబేజీ నుంచి వచ్చిన నీరుతోనే కలుపుకోవాలి, లేకపోతే పకోడీ సన్నగా అవుతుంది. వేడి నూనె వేసే ముందు నూనె బాగా వేడిచేయాలి. ఇక్కడ పకోడీలకు బియ్యప్పిండి క్రిస్పీదనాన్ని పెంచుతుందని గుర్తుంచుకోవాలి - కావాలంటే కొంచెం అదనంగా కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువైపోతే గట్టిగా కూడా అయిపోతాయి. మరింత స్పైసీ కావాలంటే కారం బదులుగా చికెన్ మసాలా / గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీ మోతాదు ఎక్కువైతే పిండికి వడివడిగా టెక్స్చర్ వస్తుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే మనం చేసే క్రిస్పీ క్యాబీజీ పకోడీలు చాలా చక్కగా వస్తాయి. మనం చేసి పెట్టిన వారు కూడా మనల్ని బాగా గుర్తుంచుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం చేసే విధానం ఎంటో ఎలాగో చెప్పేశాం కదా మీరూ ఒక్కసారి ఇంట్లో ట్రైచేసి మీరూ దాని క్రిస్పీ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. హ్యాపీ క్రిస్పీ క్యాబేజీ పకోడీ డే..!




