(ఈరోజు-గొలుగొండ)క్రిష్ణదేవీపేట)
క్రిష్ణదేవీపేట గ్రామంలో గౌరీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాల ప్రతిష్ట పసగడగుల వారి కుటుంభం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పాతూరు గ్రామంలో రామాలయం నూతనంగా నిర్మించిన సందర్భంగా ఈఏడాది గౌరీ పరమేశ్వరుల(గౌరమ్మదుబ్బు) ఉత్సవాలను తొలి ఏడాది దివంగత వీడీఓ స్వర్గీయ పసగడుగుల వెంకటరమణ కుటుంబీకుల ఆధ్వర్యంలో చేపట్టారు. తొలుత వారం రోజుల ముందు గౌరమ్మ దుబ్బు కార్యక్రమం చేపట్టి.. ఆతరువాత నేడు విగ్రహాలను ప్రతిష్టించారు. స్వామివారి విగ్రహాలకు నెల రోజుల పాటు పూజలు నిర్వహించి ఆతరువాత అనుపు మహోత్సవాన్ని నిర్వహిస్తామని స్వర్గీయ వెంకటరమణ సతీమణి రాజేశ్వరి తెలియజేశారు. వారి ఇంటి నుంచి వారి కుమారుడు, అల్లూరి చరిత్ర పరిశోధకులు బాలభాను(ఈరోజు బాలు), శిరీష మనుమడు పొన్వెల్ శ్రీరాజ్, కుందనశ్రీ, భారతి, విశ్వశాంతి, సత్యవతి, ఇతర కుటుంబ సభ్యలు, పేరంటాళ్లు.. నెత్తిన మోసుకుని.. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఇంటి దగ్గర నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అస్సెరభ శరభ, అల్లల్ల వీర, శంభోశంకరా, గౌరమ్మా దీవించమ్మా.. జై శ్రీరామమ్ నామ స్మరణల మధ్య గౌరీ పరమేశ్వరుల విగ్రహాలను తీసుకొచ్చి రామాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పసగడగుగల కుందనశ్రీ అయ్యవార్లకు నృత్యనీరాజనాన్ని సమర్పించారు.
ఉత్సవ నిర్వాహకులు పసగడుగులు రాజేశ్వరి(రాజులమ్మ) మాట్లాడుతూ..గౌరమ్మ ఉత్సవం మొక్కును రామాలయం పునర్మాణం తరువాత చేయాలని సంకల్పించామని.. అందులో భాగంగానే స్వామివారి ఉత్సవాన్ని తమ కుటుంబం ఆధ్వర్యంలో చేపడుతున్నామని అన్నారు. ఆ శివుని కరుణ, దీవెనలు గ్రామంపై ఉండాలని.. గౌరమ్మ దీవెనలతో మహిళలు పసుపు కుంకుమలతో శుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ మండల పండుగలో మూడవ సోమవారం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవ మూర్తులను ప్రతిష్టించిన సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేపట్టారు. నిర్వాహకులు భక్తులకు తీర్ధ ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ, బుజ్జి డాక్టర్, సీనియర్ జర్నలిస్టు సత్యన్నారాయణ, ఇమంది రాజుమాష్టారు, సత్యసాయి భజనా బృందం ప్రతినిధి పి. ప్రసాద్, మేకా భాస్కరరావు, పందిరి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.