(బాలు-ఈరోజు ప్రతినిధి, విశాఖపట్నం)
ప్రజల సమస్యలు పరిష్కరించడంతో ప్రభుత్వ అధికారులు చొరవ చూపిస్తే.. సమస్య తీరినా..తీరకపోయినా ముందు అధికారులపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా సమస్య ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకం ఏర్పడుతుంది. అదే సమస్యలను మనుసులో ఉంచుకొని సతమతం అయ్యేవారికి ప్రేమతో వారి ఆకలిని తీరిస్తే.. ఇక చెప్పాల్సిన పనేలేదు. ప్రజలు నిండైన మనసుతో ముందు ప్రభుత్వాన్ని దీవిస్తారు.. ఆ తరువాత ప్రభుత్వంలో ఇలాంటి మంచి కలెక్టరమ్మలు ఉన్నంత కాలం ఎవరికీ అన్యాయం జరగదనే నమ్మకం కూడా ఏర్పుడుతుంది. ఇపుడు అల్లూరి జిల్లాలో కూడా అదే నమ్మకాన్ని ఓ పేద్ద గోడగా నిర్మిస్తున్నా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి. ప్రతీ శుక్రవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీలు తీసుకొచ్చేవారికి కడుపునిండా అన్నం పెడుతున్నారు.
స్వయంగా ఆమే వడ్డించి వారి కడుపు నింపుతున్నారు. అంతేకాదు అర్జీలు ఇచ్చే వారందరినీ భోజనం చేశారా.. మంచినీరు తాగారా అంటూ ఎంతో ఆప్యాయతగా అడుగుతూ..వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న తీరు జిల్లా వాసులకు ప్రభుత్వ అధికారులపై నమ్మకాన్ని పెంచుతున్నది. అమ్మ బిడ్డల ఆకలిని తెలుసుకుంటుందనే మాట ఎంత సత్యమో.. సమస్యలతో సతమతం అవుతూ అధికారులకు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చే ప్రజల అవసరాలను.. ఆకలిని అల్లూరి జిల్లా కలెక్టరమ్మ కూడా అలానే తెలుసుకుంటూ ప్రజలు మెచ్చే కలెక్టరమ్మ అవుతున్నారు. సమస్యల ఆవేదనతో వచ్చిన వారందరూ కడుపునిండా అన్నం తిని నిండైన మనసుతో కలెక్టర్ ను దీవిస్తున్న తీరు ఇపుడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నది. స్వతహాగానే ప్రజలతో మమేకం అయ్యే జిల్లా కలెక్టర్ నిషాంతి పీజీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పెంచడంతో ఎంతో కృషి చేస్తున్నారు. అదే సమయంలో చాలా వరకూ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు.
దానితో ఆమె అల్లూరి జిల్లా ప్రజలు మెచ్చిన కలెక్టరమ్మగా మారిపోయారు. ఆమెకి సమస్యలపై అర్జీ పెడితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని గుండెల నిండా పెంచుకొని కొండంత భరోసాతో వెనుతిరుగుతున్నారు. ఇలాంటి జిల్లా కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే ప్రభుత్వానికే కాదు.. వీరుపనిచేసే జిల్లాపైనా ప్రజలు అపారమైన నమ్మకాన్ని పెంచుకుంటారనడంలో సందేహం లేదు.. ప్రార్ధించే చేతుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే పదాలను నిజం చేసి చూపుతున్న జిల్లా కలెక్టర్ నిషాంతి పరిపాలనలో అల్లూరి జిల్లా అభివృద్ధిచెందాలని..అమె సేవలు జిల్లా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోవాలని ఆశిద్దాం..!




